టాలీవుడ్ కాంట్రవర్షియల్స్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సమర్పణలో భైరవ గీత ను రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ ను గత నెల నుంచి వర్మ వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. అసలైతే మొన్నటివరకు 2.0 సినిమాకు పోటీగా భైరవగీతను నవంబర్ 30న రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. 

ఇక కొన్ని టెక్నీకల్ ప్రాబ్లమ్స్ వల్ల డిసెంబర్ 7న రిలీజ్ కానుందని ఎలక్షన్స్ మూడ్ లో మీ ఓటు భైరవగీత కు గట్టిగా వేయాలని మరో విధంగా చెప్పి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మరో కారణంతో కన్నడలో అదే సమయానికి రిలీజ్ అవుతోందని తెలుగులో మాత్రం 14న రిలీజ్ అవుతుందని వివరణ ఇచ్చాడు. 

దీంతో సినిమా రిలీజ్ చేయడానికి వర్మకు థియేటర్స్ దొరకడం లేదని నెటిజన్స్ నుంచి భిన్నభిప్రాయాలు వెలువడుతున్నాయి. అదే విధంగా ఎలక్షన్స్ ఎఫెక్ట్ పడుతుందని భయపడినట్లు టాక్. గతంలో ఎప్పుడు లేని విధంగా వర్మ తన సినిమాను రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.  మరి రిలీజ్ అయిన తరువాత వర్మ ఆ సినిమా తో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.