ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన శిష్యుడు సిద్ధార్థని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తోన్న సినిమా 'భైరవగీత'. నవంబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది.

కన్నడ నటుడు ధనుంజయ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఇర్రా కథానాయిక. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది చిత్రబృందం.

ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది. 'ఒక్కసారి కార్చిచ్చు పేట్రేగినాక దానికి పులికి, జింకకు భేదం తెలియదు' అనే డైలాగ్ తో ఆసక్తికరంగా ట్రైలర్ మొదలైంది. మధ్యలో హీరో 'నిన్న నీకు జరిగినాది.. ఈరోజు నాకు.. రేపు ఇంకొకనిని ఇది జరిగే వరకు ఎదురుచూస్తే మన బతుకులకు అర్ధం ఉండదు' అని చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చివరిలో హీరోయిన్ గొడ్డలి పట్టి నరికే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ట్రైలర్ మొత్తం హింసతో నిండిపోయింది.