Asianet News TeluguAsianet News Telugu

‘భగవంత్‌ కేసరి’ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియావైజ్)

 ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’లతో వరుసగా బ్లాక్‌ బస్టర్‌ విజయాలను అందుకున్న బాలకృష్ణ (Balakrishna)ఈ సినిమాతో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు.


  

Bhagavath Kesari had a worldwide pre-release business JSP
Author
First Published Oct 15, 2023, 7:45 AM IST

 బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే లియో, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు ఇదే దసరాకి వస్తున్నాయి.  ఈ క్రమంలో ఖచ్చితంగా పోటీ ఉన్నప్పుడు అది ప్రీ రిలీజ్ బిజినెస్ పై ఇంపాక్ట్ పడుతుంది. కానీ  ‘భగవంత్‌ కేసరి’కు అలాంటిదేమీ సమస్య ఏమీ రాకుండా ఓ రేంజిలో  69.75 కోట్ల  థియేట్రికల్ బిజినెస్ చేసింది.   ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ రాబట్టాలంటే 70 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది.  
 భాగవత్ కేసరి వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

నిజాం:  15 కోట్లు,
 సీడెడ్  :14 కోట్లు, 
ఉత్తరాంధ్ర:  8.2 కోట్లు, 
గుంటూరు:  6 కోట్లు, 
తూర్పు గోదావరి: 5 కోట్లు, 
పశ్చిమ గోదావరి:  4.2 కోట్లు, 
కృష్ణ:  4.25 కోట్లు,
 నెల్లూరు: 2.6 కోట్లు 
  మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు : 59.25 కోట్లు, 

మిగతా భారత దేశం అంతా కలిపి:  4.5 కోట్లు
 ఓవర్సీస్ : 6 కోట్లు 
మొత్తం ప్రపంచవ్యాప్తంగా : 69.75 కోట్లు 
 

  ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది.  రీసెంట్ విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అభిమానులు, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇదిలా ఉంటే, సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ని రెట్టింపు చేయటానికి  దర్శకుడు అనిల్ రావిపూడి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ సందర్భంగా, సినిమాలో రీమిక్స్ పాటలు ఉంటాయని, అయితే సినిమా ప్రారంభ రోజుల్లో వాటిని జోడించబోమని అనిల్ స్పష్టం చేశారు. .  సినిమా సాంగ్స్, డ్యుయెట్స్ ఉండవు. కథ డిమాండ్ చేయట్లేదు. నేచురల్​గా సినిమా తీశాం. లాస్ట్​లో మాత్రం ఓ సాంగ్ పెట్టం. అది సిట్యూయేషన్​కు కుదిరింది అన్నారు.
 

 ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’లతో వరుసగా బ్లాక్‌ బస్టర్‌ విజయాలను అందుకున్న బాలకృష్ణ (Balakrishna)ఈ సినిమాతో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు. ఇప్పటికే దీని టీజర్‌కు భారీ స్పందన రాగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా మిలియన్‌ వ్యూవ్స్‌తో యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. బాలకృష్ణ మార్క్‌ యాక్షన్‌ అంశాలతో పాటు అనిల్‌ శైలి వినోదాలతో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ముస్తాబవుతోంది. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios