భగవంత్ కేసరి ఓటీటీ డీటెయిల్స్... ఎక్కడ చూడొచ్చు!
భగవంత్ కేసరి నేడు విడుదలైంది. ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇక భగవంత్ సింగ్ కేసరి ఓటీటీ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి.

దర్శకుడు అనిల్ రావిపూడితో మొదటిసారి కొలాబరేట్ అయ్యాడు బాలకృష్ణ. వీరి కాంబోలో తెరకెక్కిన భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ విడుదలయ్యింది. ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో సినిమాపై ఆడియన్స్ తమ అభిప్రాయం సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. మెజారిటీ ఆడియన్స్ పర్లేదు అంటున్నారు. కథ, కథనాల్లో కొత్తదనం లేదు. అదే రొటీన్ కమర్షియల్ మూవీ.
అయితే ఎమోషనల్ సీన్స్, బాలకృష్ణ మాస్ అప్పీరెన్స్, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అలరించాయని అంటున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే సినిమాను ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. భగవంత్ కేసరి చిత్రానికి థమన్ సంగీతం మైనస్ అన్న మాట వినిపిస్తుంది. బీజీఎమ్ ఓ మోస్తరుగా ఉన్నా... సాంగ్స్ నిరాశపరిచాయని అంటున్నారు. కథలో శ్రీలీల కీలకం. కాజల్ పాత్రకు ప్రాధాన్యతకే కొరవడింది. కాబట్టి భగవంత్ కేసరి బాలయ్య వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.
ఇక భగవంత్ కేసరి ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఫ్యాన్సీ ధర చెల్లించి ప్రైమ్ భగవంత్ కేసరి హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. బాలకృష్ణ గత రెండు చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. భగవంత్ కేసరి మాత్రం ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.
దసరా బరిలో దిగిన బాలయ్య భగవంత్ కేసరి టార్గెట్ రూ. 65 కోట్లు. బాలయ్య మార్కెట్ రీత్యా కొంచెం ఎక్కువే. ఫెస్టివ్ సీజన్ కలిసొస్తుందని బయ్యర్లు నమ్ముతున్నారు. రూ. 66 కోట్లు వస్తే కానీ మూవీ హిట్ స్టేటస్ అందుకోదు. మరి ఆడియన్స్ ఎలాంటి ఫలితం ఇస్తారో చూడాలి. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం హ్యాట్రిక్ కొడతామంటూ విశ్వాసంతో ఉన్నారు.