Asianet News TeluguAsianet News Telugu

షూటింగ్ పూర్తి.. రిలీజ్ లో మార్పు లేదు.. ఆసక్తికరంగా ‘ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి’.. వీడియో చూశారా?

‘భగవంత్ కేసరి’ చిత్రీకరణ పూర్తైందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా షూటింగ్ కు సంబంధించిన డిటేయిల్స్ ను ఇంట్రెస్టింగ్ వీడియో ద్వారా తెలియజేశారు. మరోవైపు రిలీజ్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. 
 

Bhagavanth Kesari movie Shooting wrapped Official Update NSK
Author
First Published Sep 28, 2023, 5:29 PM IST

నందమూరి బాలకృష్ణ (Balakrishna)  లేటెస్ట్ ఫిల్మ్ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) . టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ఇటీవల సినిమా వాయిదా పడుతుందని, ఇంకా షూటింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉన్నాయంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా మేకర్స్ అప్డేట్ అందించారు. నిన్న అనిల్ రావిపూడి చెప్పినట్టుగానే స్పెషల్ వీడియోతో గుడ్ న్యూస్ అందించారు. 

‘భగవంత్ కేసరి’ మూవీ షూటింగ్ పూర్తైందని మేకర్స్  అధికారికరంగా వెల్లడించారు. మరోవైపు రిలీజ్ విషయంలోనూ ఎలాంటి మార్పు ఉండబోదని, అక్టోబర్ 19, 2023న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుందని పునరుద్ఘాటించారు. దీంతో బాలయ్య అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సూపర్ అప్డేట్ అందిస్తూ The Journey Of Bhagavanth Kesari వీడియోను విడుదల చేశారు. సినిమా చిత్రీకరణకు సంబంధించిన వివరాలను ఇలా విజువల్ గా చూపించారు. ఇందులోనూ బాలయ్య డైలాగ్స్ తో రచ్చ చేశారు. 

గతేడాది డిసెంబర్ లో NBK108 వర్క్ టైటిల్ తో సినిమాను ప్రారంభించారు. పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. అప్పటి నుంచి నిర్విరామంగా షూటింగ్ పనులు కొనసాగాయని తెలిపారు. సినిమా పట్ల ఎంతో ప్రేమ కలిగిన టెక్నీషియన్లు, క్రూ మెరుగైన పనితీరు చూపించారన్నారు. సినిమాను 24 లోకేషన్లు, 12 మాసీవ్ సెట్స్ లలో చిత్రీకరించినట్టు తెలిపారు. మేకింగ్ వీడియోలో చూపించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక చివర్లలో బాలయ్య చెప్పిన డైలాగ్ ‘కలిసి మాట్లాడుతా అన్నగా అంతలోనే మందిని పంపాలా.. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే’ తో సినిమా డైలాగ్స్,పైనా హైప్ ను పెంచేసింది. 

ఇప్పటికే విడుదలైన అన్ని ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.  ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించారు. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్ గా నటించింది. యంగ్ సెన్సేషన్ శ్రీలీలా కూతురి పాత్రలో అలరించబోతోంది. మ్యూజిక్  డైరెక్టర్ థమన్ సంగీతం అందించారు. ఇందులో జాతీయ అవార్డు-విజేత నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్‌ కు ఎంట్రీ ఇస్తుండటం విశేషం. చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి రామ్ ప్రసాద్, ఎడిటర్: తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దసరా కానుకగా మరో నెలరోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios