Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ నటుడు ఆంథోని హప్కిన్‌, ఉత్తమ నటి ఫ్రాన్సెస్‌ మెక్‌ డోర్మాండ్‌..ఆస్కార్‌ కంప్లీట్‌ లిస్ట్

93వ అకాడమీ అవార్డు వేడుకలో ఉత్తమ నటుడిగా `ది ఫాదర్‌` చిత్రానికి ఆంథోని హప్కిన్‌, ఉత్తమ నటిగా `నోమడ్లాండ్‌` చిత్రానికి ఫ్రాన్సెస్‌ మెక్‌ డోర్మాండ్‌ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఆస్కార్‌ పూర్తి లిస్ట్.

best actor anthony hopkins best actress frances mcdormand and oscar awards full list
Author
Hyderabad, First Published Apr 26, 2021, 9:32 AM IST

93వ అకాడమీ అవార్డు వేడుకలో ఉత్తమ నటుడిగా `ది ఫాదర్‌` చిత్రానికి ఆంథోని హప్కిన్‌, ఉత్తమ నటిగా `నోమడ్లాండ్‌` చిత్రానికి ఫ్రాన్సెస్‌ మెక్‌ డోర్మాండ్‌ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఆంథోని 1992లో `ది సైలెన్స్ ఆఫ్‌ ది లాంబ్స్` చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా స్కార్‌ దక్కించుకోగా, సరిగ్గా ముప్పై ఏళ్ల తర్వాత మరోసారి అవార్డు పొందడం విశేషం. ఇక అమెరికన్‌ నటి ఫ్రాన్సెస్‌ మెక్‌ డోర్మాండ్‌కిది మూడో ఆస్కార్‌ అవార్డు కావడం విశేషం. ఆమె ఇప్పటికే 1997లో `ఫార్గో` చిత్రానికిగానూ, 2018లో `త్రీ బిల్‌బోర్డ్ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరి` చిత్రానికిగానూ అకాడమీ అవార్డులను సొంతం చేసుకుంది. 

ప్రపంచ సినిమాలో గొప్పగా భావించే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం కరోనా కారణంగా వాయిదా పడి ఎట్టకేలకు ప్రకటించారు. ఫిబ్రవరిలోనే ఈ అవార్డులను ప్రతి ఏడాది ఇవ్వాల్సి ఉంటుంది. కొవిడ్‌ కారణంగా రెండు ప్రాంతాల్లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే వేడుకకు హాజరయ్యారు. ఆస్కార్‌ అవార్డు పూర్తి లిస్ట్ 

ఉత్తమ చిత్రంః `నోమడ్లాండ్‌`

ఉత్తమ నటుడుః ఆంథోని హప్కిన్‌(ది ఫాదర్‌)

ఉత్తమ నటిః ఫ్రాన్సెస్‌ మెక్‌ డోర్మాండ్‌(నోమడ్లాండ్‌)

ఉత్తమ డైరెక్టర్‌: కోవ్లీ చావ్‌(నోమడ్లాండ్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఎరిక్‌(మ్యాంక)

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఎమరాల్డ్ ఫెనెల్‌(ప్రామిసంగ్‌ యంగ్‌ ఉమెన్‌)

ఉత్తమ సౌండ్‌:  సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌

ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్‌ ఫిల్మ్‌:  అనదర్‌ రౌండ్‌(డెన్మార్క్‌)

ఉత్తమ సహాయ నటుడు:  డానియొల్‌ కలువోయా(జూడాస్‌ అండ్‌ ది బ్లాక్‌ మిస్సయ్యా)

ఉత్తమ సహాయ నటి:  యున్‌ యా జంగ్‌(మినారి)

ఉత్తమ అడాప్‌టెడ్‌ స్క్రీన్‌ ప్లే: క్రిస్టోఫర్‌ హామ్టన్‌, ఫ్లొరియరన్‌ జెల్లర్‌(ది ఫాదర్‌)

ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: సెర్హియో లోఫెజ్‌, మియానీల్‌, జమికా విల్సన్‌(మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: అన్‌రాత్‌(మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పీట్‌ డాక్టర్‌, దానా మరీ(సోల్‌)

ఉత్తమ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: మార్టిన్‌ డెస్మండ్‌ రాయ్‌(టూ డిస్టెంట్‌ స్ట్రేంజర్స్‌)

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: మైకల్‌ గ్రోవియర్‌(ఇఫ్‌ ఎనిథింగ్‌ హ్యాపెన్‌ ఐ లవ్‌ యూ)

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌: అంథోని(కలెక్టివ్‌)

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌:  అండ్రూ జాక్సన్‌, డేవిడ్‌ లీ(టెనెట్‌)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: డొనాల్డ్‌ బర్ట్‌(మ్యాంక్‌)

ఉత్తమ డాక్యమెంటరీ ఫీచర్‌: పిపా, జేమ్స్‌ రీడ్‌, క్రేగ్‌ ఫాస్టర్‌(మై అక్టోపస్‌ టీచర్‌)

Follow Us:
Download App:
  • android
  • ios