లాక్‌ డౌన్‌ సమయంలో సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతన్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా ద్వారా వేదింపులు ఎదురవుతుండగా.. మరికొందరికి వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి తెర మీదకు వచ్చింది. బిజోయ్ ఘర్ ప్రాంతంలో ఉంటున్న 26 ఏళ్ల బెంగాళీ నటిపై కొంతమంది దుండగులు అత్యాచారం జరిపారు.  బుధవారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు నటి జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో జూలై 8 కంప్లయింట్‌ నమోదైంది.

పలు టెలివిజన్‌ సీరియల్స్‌లో  లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఈమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నెల 5వ తేదిన కొంత మంది దుండగులు నటి నివసిస్తున్న ఫ్లాట్‌కు వచ్చి ఆర్థిక సాయం చేయాలంటూ కోరారని. ఆ సమయంలో నటి ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన ఆ దుండగులు ఆమె మీద అత్యాచారానికి తెగబడ్డారని నటి ఫిర్యాదు చేసింది. తన స్టేట్‌ మెంట్‌ లో ఆ ఫ్లాట్‌ లో కొంత కాలంగా ఒంటరిగానే ఉంటున్నట్టుగా పేర్కొంది నటి.

దుండగులు తనను రేప్ చేయటం మాత్రమే కాదు. ఆ దారుణాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారని వెల్లడించింది. అయితే ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన నటి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్‌ 306/506 కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.

ప్రాథమిక విచారణలో దారుణానికి పాల్పడ్డ వ్యక్తి నటికి పరిచయస్తుడే అని తేలినట్టుగా పోలీస్‌ అధికారులు వెల్లడించారు. నింధితుడికి నటితో పరిచయం ఉందని, కానీ కొన్ని కారణాలతో వారిద్దరు మాట్లాడుకోవటం లేదని గుర్తించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.