టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు సరైన హిట్టుని అందుకోలేకపోయాడు. కానీ అతడికి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. తన ప్రతి సినిమాలో టాప్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసే ఈ హీరో ప్రస్తుతం 'సీత' అనే సినిమాలో నటిస్తున్నాడు.

తేజ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు తాజాగా మరో సినిమా ఓకే చేశాడు బెల్లంకొండ. 'RX100'చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ కి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'అల్లుడు శ్రీను' సినిమా వచ్చింది. ఇప్పుడు మరోసారి సమంతతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ హీరో.

ప్రస్తుతం దర్శకనిర్మాతలు సమంతతో చర్చలు జరుపుతున్నారు. అవి కొలిక్కి వచ్చిన తరువాత వచ్చే వారంలో దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ చేయనున్నారు. భారీ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.