యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైదరాబాద్ రోడ్లపై ఓ సాధారణ వ్యక్తిలా చక్కర్లు కొట్టడం వార్తల్లో నిలిచింది. సాధారణ ప్రయాణికులతో కలిసి ఆటోలు, బస్సులు, మెట్రో రైలులో ప్రయాణిస్తూ షాక్ ఇచ్చారు.

సికింద్రాబాద్ బస్ స్టాప్ వద్ద ఓ బస్సు ఎక్కి కిటికీ వైపు కూర్చొని సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితంలో మొదటిసారిగా బస్ ఎక్కానని ఆ అనుభవం మర్చిపోలేనని అన్నారు. అలానే బైక్ మీద ట్రిపుల్ రైడ్ చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చారు.

రూల్స్ బ్రేక్ చేస్తున్నానని తనకు తెలుసునని కానీ ఫోటో కోసం అలా చేయాల్సివచ్చిందని అన్నారు. మెట్రోలో కూడా ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా భాగ్యనగరంలో తన జర్నీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం ఈ హీరో నటించిన 'రాక్షసుడు' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో వచ్చిన 'రాచ్చసన్' సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.