యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు భారీ బడ్జెట్ మాస్ చిత్రాల్లో నటించినా.. సరైన కమర్షియల్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయాడు. బోయపాటి దర్శకత్వంలో నటించిన 'జయ జానకి నాయక' సినిమాకి కూడా ఏవరేజ్ మార్కులే పడ్డాయి.

ప్రస్తుతం ఈ హీరో తేజ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. అలానే కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళరూపొందిస్తోన్న మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. దీనికి 'కవచం' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు.

పోలీస్ యూనిఫామ్ లో ఉన్న బెల్లంకొండ లుక్ ని విడుదల చేశారు. పోస్టర్ లో క్రియేటివిటీ పెద్దగా లేకపోయినా.. టైటిల్ మాత్రం క్యాచీగా ఉంది. పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి గుర్తింపు సంపాదిస్తాడో చూడాలి!