బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కవచం చిత్రం ఈనెల 7న భారీ ఎత్తున విడుదల అయ్యింది.ఈ కవచం తో సాలిడ్ హిట్ కొట్టబోతున్నానంటూ ధీమా వ్యక్తం చేస్తూ భాక్సాఫీస్ వద్ద యుద్దానికి దిగాడు . ఇంతకుముందు చేసిన సినిమాల బడ్జెట్ ఎక్కువ అయితే ఈ కవచం ని మాత్రం తక్కువ బడ్జెట్ లో చేశామని , క్వాలిటీ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని ఇక సినిమా పరంగా కూడా సక్సెస్ కొడతా మంటూ బెల్లంకొండ శ్రీనివాస్ ..రిలీజ్ కు ముందు చాలా చెప్పారు. కవచం  రిలీజ్ కి ముందే పది కోట్ల టేబుల్ ప్రాఫిట్ తీసుకువచ్చిందని అన్నాడు సాయి శ్రీనివాస్. 

అయితే ఇప్పుడు క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే ఎవరికి టేబుల్ ప్రాఫిట్ , ఎవరికి లాస్ అనేది అర్దం కాని పరిస్దితి ఏర్పడింది. శ్రీనివాస్ చెప్పింది అబద్దమేనా అనే సందేహం వచ్చేసింది. సినిమా రిలీజైన మార్నింగ్ షో కే ప్లాప్ టాక్ తెచ్చేసుకుంది.  అప్పటికే రిలీజ్ అయిన 2.0 జోరు ఇంకా కొనసాగుతూంటే, కవచం మాత్రం తన బిజినెస్ కట్టిపెట్టేసింది. ఈ  క్లోజింగ్ కలెక్షన్స్ ఫుల్ రన్ లో   4.59కోట్ల లోపు  సరిపెట్టుకుంది ఈ సినిమా. 

రిలీజైన రెండవ రోజే ఏకంగా   ఏకంగా 70% వరకు డ్రాప్  ఉండటంతో భాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేక చేతులెత్తేసింది ఈ సినిమా.  ఈ సినిమా బడ్జెట్ కు  ఇది చావుదెబ్బ అనే చెప్పాలి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాపై 18 కోట్లు దాకా పెట్టుబడి పెట్టారు.

దాంతో  మినిమం ఒడ్డున పడాలంటే 19 కోట్ల టార్గెట్ ఫిక్స్ అయ్యింది. దాన్ని అందుకోవడానికి సినిమా ప్రయత్నం చేయకముందే చతికిల పడింది. ఇక అది అసాధ్యమే అని చెప్పుచ్చు.  దాంతో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. పోలీస్ ఆఫీసర్ గా కనిపించినా , ఇద్దరు అందాల ముద్దుగుమ్మ లు కాజల్ అగర్వాల్ , మెహరీన్ లతో బెల్లంకొండ చేసిన రొమాన్స్ కూడా ఈ సినిమాకు ప్లస్ కాకపోవటం విషాదమే.