సీనియర్ దర్శకుడు తేజ వ్యవహారశైలి అందరికీ తెలిసిందే. సినిమాల విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. కొన్ని సార్లు సెట్ లో నటీనటులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల తన ఆటిట్యూడ్ కారణంగానే 'ఎన్టీఆర్' బయోపిక్ ఛాన్స్ వదులుకున్నాడని అంటారు.

బాలయ్యతో అభిప్రాయబేధాలు రావడంతో తేజ ఆ ప్రాజెక్ట్ నుండి వాకౌట్ చేశాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా 'సీత' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తేజ.. హీరోపై ఫైర్ అయినట్లు సమాచారం. 

తేజ కోరినట్లుగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించకపోవడం, తన లుక్ విషయంలో కూడా తేజ చెప్పినట్లుగా ఫాలో అవ్వకపోవడంతో సెట్ లో తేజ కోప్పడినట్లు టాక్. తేజ సినిమాలు కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఉంటాయి. మరోపక్క హీరో బెల్లంకొండ ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలే చేసుకుంటూ వచ్చాడు.

దీంతో కమర్షియల్ చిత్రాల మాదిరిగానే తేజ సినిమాలో కూడా నటిస్తుండడంతో ఆయన సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి  పడకపోయినా అడ్జస్ట్ అవుతూ షూటింగ్ పూర్తి చేస్తున్నారని సమాచారం. ఏప్రిల్ 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.