బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘అల్లుడు అదుర్స్‌’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర టీమ్ ట్రైలర్‌ను విడుదల చేసింది.   ‘ఒక్కసారి నాది అనుకుంటే ప్రాణం ఇస్తా.. అదే నా క్యారెక్టరైజేషన్‌’ అంటున్నారు ఈ ట్రైలర్ లో  బెల్లంకొండ శ్రీనివాస్‌.  

‘శీనుగాడు నా ఫ్రెండ్‌.. యాక్షన్‌ సీక్వెన్స్‌లో వాడిది సపరేట్‌ ట్రెండ్‌.. ఇక్కడ హ్యాష్‌ ట్యాగ్స్‌ లేవమ్మా..’ అంటూ వెన్నెల కిషోర్‌ చెబుతున్న డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి. నభా నటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, సోనూసూద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఆద్యంతం అలరించేలా సాగే ఈ ట్రైలర్‌ను మీరూ చూసేయండి.