Asianet News TeluguAsianet News Telugu

`ఛత్రపతి` రీమేక్‌ సెట్‌ ధ్వంసం..నష్టం ఎంతంటే?

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్ ప‌తాకంపై డా. జ‌యంతిలాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రీమేక్‌ సెట్‌ ధ్వంసమైంది. అకాల వర్షాల కారణంగా పాడైపోయినట్టు చిత్ర బృందం తెలిపింది.

bellamkonda sai srinivas starrer chatrapati remake set damaged  arj
Author
Hyderabad, First Published Jun 3, 2021, 8:07 PM IST

ప్రభాస్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లో ఒకటి `ఛత్రపతి`. రాజమౌళి దర్శకత్వంలో 2005లో విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమాని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా దర్శకుడు వినాయక్‌ బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు.  బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్ ప‌తాకంపై డా. జ‌యంతిలాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రీమేక్‌ సెట్‌ ధ్వంసమైంది. అకాల వర్షాల కారణంగా పాడైపోయినట్టు చిత్ర బృందం తెలిపింది.

యూనిట్‌ తెలియజేస్తూ, ` `అల్లుడు శీను`, `జయ జానకి నాయక`, `సాక్ష్యం`, `రాక్షసుడు` వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులో నటుడిగా తనదైన ముద్ర వేసిన యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ `ఛత్రపతి` చిత్రం హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నారు. `అల్లుడు శీను` చిత్రంతో హీరోగా తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకులు వీవీ వినాయక్ ఈ మూవీతో  బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హిందీ చిత్ర పరిశ్రమకు కూడా హీరోగా పరిచయం చేస్తుండ‌టం విశేషం. 

తెలుగు `ఛత్రపతి` చిత్రానికి కథ అందించిన రాజమౌళి తండ్రి, ప్రముఖ దర్శక, రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ హిందీ రీమేక్‌కు స్క్రిప్ట్‌ అందిస్తున్నారు. ఇక `ఆది`, `ఠాగూర్,` `ఖైదీ నంబరు 150` వంటి విజయవంతమైన చిత్రాలతో వివి వినాయక్‌ స్టార్‌ డైరెక్టర్ జాబితాలో చేరిపోయారు. ఇక `ఛత్రపతి` హిందీ రీమేక్‌ షూటింగ్‌ను ఏప్రిల్‌ 22న మొదలు పెట్టాలనుకున్నాం. ఇందుకోసం 3 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆరు ఏకరాల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌ సునీల్‌బాబు ఓ విలేజ్‌ సెట్‌ను ఏర్పాటు చేశాం. 

`రంగస్థలం` విలేజ్‌ సెట్‌ను కూడా అప్పట్లో ఇదే లొకేషన్‌లో క్రియేట్‌ చేశారు. దురదృష్టవశాత్తు కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు, లాక్‌డౌన్‌ వంటి కారణాలతో ఈ రీమేక్‌ షూటింగ్‌ను అనుకున్న సమయానికి ప్రారంభించలేకపోయాం. ఈ లోపు 3కోట్ల రూపాయలతో వేసిన సెట్‌ ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల తాకిడికి తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఈ సెట్‌ను పునరుద్దరించే పనిలో పడ్డారు ఆర్ట్‌ డైరెక్టర్‌ సునీల్‌ బాబు అండ్‌ కో. ఈ సెట్‌ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించ‌నున్నాం‌. 

భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సరికొత్త అవతారంలో కనిపించ నున్నారు.  ఈ సినిమా టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామ`ని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios