బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్ జంట‌గా న‌టించిన  'రాక్షసుడు'  మొన్న శుక్రవారం (జులై 2న) రిలీజైంది. ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఏ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై హ‌వీశ్ ప్రొడ‌క్షన్‌లో ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శక‌ుడిగా రూపొందిన ఈ చిత్రానికి ఓపెనింగ్స్  ఓ మాదిరిగా ఉన్నప్పటికీ  పాజిటివ్ టాక్‌తో ఫస్ట్ వీకెండ్ వసూళ్లు  బాగున్నాయి. మూడు రోజుల్లో దాదాపు 50 శాతం డిస్ట్రిబ్యూటర్స్ ఇన్విస్టిమెంట్ రికవరీ అయ్యింది.  
  
అయితే యుఎస్ లో మాత్రం ఈ సినిమా ఫ్లాఫ్   వాతావరణం కనపడుతోంది. అక్కడ  ప్రీమియర్స్ , శుక్రవారం కలెక్షన్స్    $31,200  వచ్చాయి. శని, ఆదివారాలు  ఇంకా తక్కువ కలెక్ట్ చేసింది. మూడు రోజులు కలిసి  $84,200 మాత్రమే వసూలు చేసింది. ట్రేడ్ ఎనాలసిస్ ప్రకారం అక్కడ ప్లాఫ్ క్రిందే లెక్క అని తేల్చారు. 
 
ఇక ప్రపంచ వ్యాప్తంగా  ఫస్ట్ వీకెండ్  6.65 కోట్లు  కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఏరియా వైజ్ బ్రేకప్ చేసి చూస్తే... :ఏరియా                                  షేర్  (కోట్లలో)

--------------------                ----------------------------------------
నైజాం                                      2.30

సీడెడ్                                      0.86

నెల్లూరు                               0.17

కృష్ణ                                     0.43

గుంటూరు                                    0.45

వైజాగ్                                          0.86

ఈస్ట్ గోదావరి                      0.40

వెస్ట్ గోదావరి                     0.33

మొత్తం ఆంధ్రా & తెలంగాణా షేర్  5.80

భారత్ లో మిగిలిన ప్రాంతాలు                                            0.60

ఓవర్ సీస్                              0.25

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం షేర్                  6.65 

 తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ రూ. 12.30 కోట్లకు అమ్మారు.   బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రచన: సాగర్, ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: సత్యనారాయణ కొనేరు, దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.