1970-80 కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వర రావ్. ఈ గజదొంగ బయోపిక్ కోసం గత కొంత కాలంగా దర్శకుడు వంశీ కృష్ణ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. మొదట రానా నటిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ చివరికి సినిమా బెల్లకొండ శ్రీనివాస్ దగ్గరికి వెళ్లింది. 

రాబిన్ హుడ్ తరహాలో దొరల సొమ్మును కొల్లగొట్టి పేదవాళ్లకు పంచే టైగర్ నాగేశ్వర్ రావ్ కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పదేళ్ల పాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి తప్పించుకుంటూ తిరిగిన అతని అసలు కథను తెరపై చూపించబోతున్నారు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ పాత్రకు తగ్గట్టుగా ఫిట్ నెస్ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 

ఇక సినిమాను ఆగస్ట్ లో మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ అనుకుంటున్నారు. ఈ ఏడాది ఎండింగ్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. పాయల్ రాజ్ పుత్ బెల్లంకొండ సరసన సినిమాలో హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.