సినీ సెలబ్రిటీలు ఇప్పుడిప్పుడే ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ, రాజేంద్రప్రసాద్‌ ఫ్యామిలీ, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, మంచు లక్ష్మీ, పరుచూరి గోపాలకృష్ణ, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, వందేమాతరం శ్రీనివాస్‌ వంటి వారు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 

తాజాగా మరో యంగ్‌ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని రోడ్‌ నెం.72 వద్ద గల పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓట్‌ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓట్‌ వేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. అది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. హైదరాబాద్‌లో ఉన్న అందరు ఓటుని వినియోగించుకోవాలి` అని తెలిపారు.