హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి షాక్.. సాక్ష్యం షోలు రద్దు

First Published 27, Jul 2018, 12:57 PM IST
belamkonda srinivas sakshyam movie relase delayed
Highlights

 ‌నిర్మాత అభిషేక్ నామా, ఫైనాన్షియర్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగానే షోలు ఆగినట్లు సమాచారం. చిత్ర విడుదలను నిలిపివేయాలని నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా అందినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఉదయం షోలు రద్దయ్యాయంట. 

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం సాక్ష్యం. శ్రీవాస్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు(జూలై 27)న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే ఎర్లి మార్నింగ్‌ షోతోపాటు మార్నింగ్‌ షోలు కూడా దాదాపు రద్దయ్యాయి. ఇందుకు టెక్నికల్‌ ఇష్య్సూ కారణమని చెబుతున్నప్పటికీ..  మరోవైపు న్యాయపరమైన సమస్యలనే టాక్‌ వినిపిస్తోంది.

 ‌నిర్మాత అభిషేక్ నామా, ఫైనాన్షియర్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగానే షోలు ఆగినట్లు సమాచారం. చిత్ర విడుదలను నిలిపివేయాలని నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా అందినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఉదయం షోలు రద్దయ్యాయంట. 

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఇప్పటి వరకు ఈ చిత్రం షోలు పడలేదు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో పడాల్సిన 8.45 గంటల షో కూడా రద్దయింది. ఏపీ, తెలంగాణల్లో మార్నింగ్ షోలు కూడా ఉండవని పలువురు సినీ జర్నలిస్టులు ట్వీట్లు చేశారు. మధ్యాహ్నానికి ఈ సమస్యలన్నీ పరిష్కరించకుని మ్యాట్నీ షో నుంచి చిత్ర ప్రదర్శనను ప్రారంభించాలని నిర్మాత యత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్‌కు డిజిటల్ ప్రింట్ అందలేదు. 

కాస్త లేటుగా  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే బెల్లంకొండ సరసన నటిస్తోంది.

loader