తొలిసారి త్రి పాత్రాభినయం చేస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్లుగా రాశీఖన్నా, నివేదా థామస్ విడుదలకు ముందే రూ.80కోట్ల బిజినెస్ చేస్తున్న జైలవకుశ

ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘ జై లవ కుశ’. ఇప్పటికే సినిమాలోని మూడు పాత్రల టీజర్లను విడుదల చేసింది చిత్ర బృందం. వీటికి అభిమానుల మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర విషయం బయటపడింది.

ఈ సినిమాకి ఎన్టీఆర్ సోదరుడు... హీరో కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు హీరోగానూ మంచి హిట్లు లేక.. నిర్మాతగానూ కిక్ 2 సినిమాతో నష్టాల్లో ఉన్నాడు కల్యాణ్ రామ్. అయితే.. ఈ జైలవకుశ ద్వారా.. కల్యాణ్ కష్టాలు తీరిపోయినట్టే అని టాక్.

సినిమాని తక్కువ బడ్జెట్ లో తీర్చిదిద్దేందుకు ఈ ఇద్దరు అన్నదమ్ములు తమ శాయశక్తుల్లా కృషి చేస్తున్నారట. హీరోయిన్లుగా రాశీఖన్నా, నివేదా థామస్ లను తీసుకోవడానికి కూడా కారణం ఇదేనట. ఈ ముద్దుగుమ్మలు ఇప్పుడిప్పుడే కెరిర్ ప్రారంభిస్తున్నారు.. అందులోనూ ఎన్టీఆర్ సరసన అవకాశం అనేసరికి తక్కువ పారితోషకానికే సినిమా అంగీకరించినట్టు సమాచారం.

ఇక దర్శకుడు బాబి కి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ హిట్లు లేవు. ఎన్టీఆర్ కూడా పారితోషకం తీసుకోవడం లేదట. ఇవన్నీ.. సినిమా బడ్జెట్ విషయంలో కల్యాణ్ రామ్ కి కలిసొచ్చాయని టాలీవుడ్ టాక్. ఇకపోతే.. తారక్ క్రేజ్ కారణంగా ఇప్పటికే ఈ సినిమాక రూ.80కోట్ల బిజినెస్ జరిగిపోయిందట. శాటిలైట్ల హక్కులు మరో రూ.20కోట్లు రావచ్చని అంచనా.. ఎలా చూసుకున్న పెట్టిన పెట్టుబడులు పోగా.. లాభాలు రావడం ఖాయమని తెలుస్తోంది. దీంతో ఈ సంవత్సరం కల్యాణ్ రామ్ ఫేట్ మారిపోయినట్టే. ఈ సినిమా లాభాల్లో ఎన్టీఆర్ కి వాటా ఉందండోయ్.. అందుకే పారితోషకం తీసుకోలేదు.