మరికొద్ది రోజుల్లో ఆస్కార్ వేడుక జరగనుంది. ప్రఖ్యాత సినిమా వేడుకకు ముందు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆసక్తికర కామెంట్స్ చేశారు.
దశాబ్దాలుగా హాలీవుడ్ సినిమాలు ఆధిపత్యం చాటుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక వర్గం ఇష్టపడే యాక్షన్, గ్రాండ్ నెస్ ఆ చిత్రాలు కలిగి ఉంటున్నాయి. ఇండియాలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ అదే తరహా చిత్రం అని నేను భావిస్తున్నాను. ఆర్ ఆర్ ఆర్ లో అద్భుతమైన యాక్షన్ ఉంటుంది. అలాగే ప్రతి యాక్షన్ సీన్ వెనుక పాత్రల ఎమోషన్ ఉంటుంది. అందుకే ఆర్ ఆర్ ఆర్ ప్రత్యేకం అని నా భావన. అలాగే ఆర్ ఆర్ ఆర్ ఫుల్ ప్యాక్డ్ మూవీ. ఇందులో యాక్షన్, ఎమోషన్, హ్యూమర్, డాన్స్ అన్ని అంశాలు ఉన్నాయి. ఇండియన్ సినిమా అంటే హిందీ మూవీస్ మాత్రమే అన్న భావన ప్రపంచవ్యాప్తంగా ఉంది. హిందీతో పాటు సౌత్ ఇండియాలో కూడా సినిమా పరిశ్రమలు ఉన్నాయన్న విషయాన్ని ఆర్ ఆర్ ఆర్ మూవీ వెలుగులోకి తెచ్చింది.
చిన్నప్పటి నుండి నాపై విజయా ప్రొడక్షన్స్ చిత్రాల ప్రభావం ఉంది. కె వి రెడ్డి, ఎల్ వి ప్రసాద్ వంటి మేకర్స్... మాయాబజార్, మిస్సమ్మ వంటి సినిమాలు ప్రభావితం చేశాయి. అలాగే హాలీవుడ్ మూవీ బెన్హర్, దర్శకులు జేమ్స్ కామెరూన్, స్పీల్బర్గ్ చిత్రాలు స్ఫూర్తినిచ్చాయి. ఒక సినిమా స్టూడెంట్ వలె కాకుండా నేను ప్రేక్షకుడిగా ఆ చిత్రాలను ఎంజాయ్ చేశాను. మార్వెల్ ఒక పెద్ద స్టూడియో. మార్వెల్ మూవీ చేయడం గొప్ప గౌరవం. అయితే వాళ్ళతో నాకు సెట్ కాకపోవచ్చు. ఇక్కడ నా టీమ్ తో ఉన్న కోఆర్డినేషన్ వాళ్లతో కుదరకపోవచ్చు. మార్వెల్ స్టూడియో దర్శకులకు కొన్ని సూచనలు చేస్తారు. వారి వర్కింగ్ స్టైల్ నా వర్కింగ్ స్టైల్ మధ్య పొంతన కుదరదు . ఇక ఆస్కార్ కి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఏం జరుగుతుందో చూడాలని, రాజమౌళి అన్నారు.
ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్ నామినేషన్ సాధించింది. మార్చి 12న ఆస్కార్ ఈవెంట్ జరగనుంది. ఆ రోజు ఆర్ ఆర్ ఆర్ భవితవ్యం తేలనుంది. ఇప్పటికే నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. ఈ క్రమంలో ఆస్కార్ ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం మేకర్స్ లో ఉంది. ఇక ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కింది. దాదాపు రూ. 500 బడ్జెట్ కేటాయించారు. వరల్డ్ వైడ్ ఆర్ ఆర్ ఆర్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా నటించారు. డివివి దానయ్య ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించగా.. అజయ్ దేవ్ గణ్ కీలక పాత్ర చేశారు.
