హీరో కార్తీకేయ - నేహా శెట్టి జంటగా అలరించబోతున్న చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). తాజాగా ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ఈ అప్డేట్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  

‘ఆర్ ఎక్స్ 100’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో కార్తికేయ (Karthikeya) తాజాగా నటిస్తున్న చిత్రం ‘బెదురులంక 2012’. హీరోయిన్ గా ‘డీజే టిల్లు’తో ఫేమ్ సంపాదించుకున్న నేహా శెట్టి (Shetty) ఆడిపాడుతోంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫొటో’ నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రూపుదిద్దుకుంది. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు కాగా.. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. 

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి. ఇప్పటికే మూవీ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. ఆకట్టుకుంటోంది. ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో 'బెదురులంక 2012' చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శక - నిర్మాతలు ఇంతకు ముందు తెలిపారు. 'ద వరల్డ్ ఆఫ్ బెదురులంక 2012' వీడియో గ్లింప్స్ లో ఆ ఊరిని, అందులోని మనుషులను పరిచయం చేశారు. విశాలమైన గోదావరి... తీరంలో పచ్చటి కొబ్బరి చెట్లు... మధ్యలో మనుషులు... బండి మీద దూసుకు వెళుతున్న కథానాయకుడు కార్తికేయ... ఊరు ఎలా ఉంటుందో వీడియో ప్రారంభంలో చూపించారు. కళ్ళకు కనిపించే విజువల్ కంటే చెవులకు వినబడే సంగీతం సెకన్లలో మైండ్‌కు ఎక్కేసేలా ఉంది. తుపాకీ తూటాలకు బయపడి ప్రజలు భయంతో పరిగెడుతుండటం.. అదే సమయంలో ఫుడ్ కోసం జనాలు అందరూ ఒక్కసారిగా తిండి మీద పడటం.. మరోవైపు ప్రేమ కోసం పరితపించే జంటను చూపించారు. సుమారు నిమిషం నిడివి గల టీజర్‌లో కార్తికేయ, నేహా శెట్టి మధ్య ప్రేమతో పాటు అజయ్ ఘోష్, రాజ్ కుమార్ బసిరెడ్డి, గోపరాజు రమణ, 'ఆటో' రామ్ ప్రసాద్ క్యారెక్టర్లనూ దర్శకుడు క్లాక్స్ పరిచయం చేశారు. యుగాంతం వస్తుందని ఊరిలో ప్రజలు అందరూ ఎంజాయ్ చేసే విధానం నవ్వులు పూయించేలా ఉంది. 

అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కించబోతున్నారు. చిత్రంతో మునుపెన్నడూ లేని వింతలు, విడ్డూరాలతో అలరించేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ప్రమోషన్స్ ను షురూ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు. చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన బాణీలు అందిస్తున్నారకు. ఓ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించడం విశేషం.

Scroll to load tweet…