Asianet News TeluguAsianet News Telugu

ఫేస్బుక్ లో చాట్స్ చేసి బర్రెలక్క డబ్బులు వసూలు చేస్తుందా... స్వయంగా స్పందించిన సోషల్ మీడియా స్టార్!

సోషల్ మీడియా సెన్సేషన్ బర్రెలక్క ఓ వివాదం లో ఇరుక్కుంది. కన్నడ మీడియాలో ఆమెపై కథనాలు వెలువడుతున్నాయి. ఆమె సోషల్ మీడియా ద్వారా మోసాలకు పాల్పడుతుందట. దీనిపై ఆమె స్వయంగా స్పందించింది.. 
 

barrelakka alias karne sirisha condemns fake news on her ksr
Author
First Published Aug 23, 2024, 8:20 AM IST | Last Updated Aug 23, 2024, 8:20 AM IST

బర్రెలక్క అలియా కర్నె శిరీష తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. డిగ్రీ చదువుకున్న ఈ తెలంగాణ యువతి సోషల్ మీడియా వీడియోలతో పాప్యులర్ అయ్యింది. చదువుకున్నా కానీ ఉద్యోగాలు లేవు. అందుకే బర్రెలు కొని మేపుకుంటున్నా.. అంటూ ఆమె వీడియోలు చేసేది. ఆమె రీల్స్ వైరల్ కావడంతో బర్రెలక్కగా సోషల్ మీడియా జనాల్లో పాప్యులర్ అయ్యింది. 

గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ చేయడంతో ఆమె ఫేమ్ మరింత పెరిగింది. బర్రెలక్కకు సపోర్ట్ గా జేడీ లక్ష్మీ నారాయణ ప్రచారం చేయడం కొసమెరుపు. ఎలాంటి నేపథ్యం లేని సామాన్యురాలు బర్రెలక్క ఐదు వేలకు పైగా ఓట్లు సంపాదించి ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతరం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఆమె పోటీ చేశారు. 

త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో బర్రెలక్క కంటెస్ట్ చేస్తుందంటూ గట్టిగా ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్లో బర్రెలక్కను చూడొచ్చని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు. అనూహ్యంగా బర్రెలక్క ఓ వివాదంలో ఇరుక్కుంది. కన్నడ మీడియాలో ఆమెపై కథనాలు వెలువడుతున్నాయట. ఫేస్ బుక్ లో చాట్ చేసి బర్రెలక్క మగాళ్ల వద్ద డబ్బులు వసూలు చేస్తుందట. 

ఈ ప్రచారం పై బర్రెలక్క నేరుగా స్పందించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ ఎస్పీతో మాట్లాడి ఆమె ఫిర్యాదు చేశారు. తన పేరున అనేక ఫేక్ ఐడీలు ఉన్నాయి. ఎవరో చేసిన దానికి నన్ను బలి చేస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నాను... అని బర్రెలక్క ఆవేదన చెందారు. 

ఈ వివాదంలో బర్రెలక్కకు ఆమె అభిమానులు అండగా నిలిచారు. మీరు బాధపడకండి. పోలీసులకు ఫిర్యాదు చేయండి. మీరు ఎలాంటి వారో మాకు తెలుసని మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది బర్రెలక్క చుట్టాలబ్బాయిని వివాహం చేసుకుంది. బర్రెలక్క పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios