ఆచార్యతో అభిమానులు నిరాశపరిచిన మెగా టీమ్.. ఈమూవీ నుంచి సర్ ప్రైజ్ వీడియోస్ ను ప్లాన్ చేస్తున్నారు. ఫుల్ వీడియో సాంగ్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు ఆచార్య మేకర్స్. 

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ చరణ్ లీడ్ రోల్స్ చేసిన సినిమా ఆచార్య. ఏప్రిల్ 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లను పలకరించిన ఈమూవీని నిరంజన్ రెడ్డి - అన్వేశ్ రెడ్డి నిర్మించగా.. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఆచార్యలో మణిశర్మ అందించిన బాణీలకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాని సినిమా మాత్రం నిరాశపరిచింది. 

మెగా అభిమనులు ఎన్నో ఆశలతో ఎదురు చూసిన సినిమా.. తీవ్రంగా నిరాశపరచడంతో సైలెంట్ అయిపోయారు మెగా ఫ్యాన్స్. ఇక నెక్ట్స్ మెగాస్టార్ నుంచి మరో సారి ఇలాంటి సినిమా కాకుండా మంచి సినిమా రావాలంటూ కొంత మంది అంటుంటే.. ఆచార్య అద్భుతంగా ఉందంటూ మరికొంత మంది మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈమూవీ నుంయి ఫ్యాన్స్ కోసం స్పెషల్ సర్ ప్రైజ్ లు కూడా ప్లాన్ చేశారు టీమ్. 

YouTube video player

తాజాగా ఈ సినిమా నుంచి భలే భలే బంజారా ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. నక్సలైట్లుగా ఉన్న ఆచార్య - సిద్ధ .. బృందంపై, రాత్రివేళలో గిరిజన గూడెంలో చిత్రీకరించిన పాట ఇది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను, శంకర్ మహదేవన్ - రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ తో ఈసాంగ్ దుమ్ము రేపింది. 

చిరంజీవితో పోటీ పడి రామ్ చరణ్ స్టెప్పులేశారు ఈపాటలో, మణిశర్మ అందించిన అద్భుతమైన మాస్ బీట్స్ లో ఇది ఒకటి. అటవీ ప్రాంతంలోని ఒక కోయగూడెంలో .. ఓ వెన్నెల రాత్రిలో నక్సలైట్స్ సరదాగా ఆడిపాడితే ఎలా ఉంటుందనేది బాగా అర్థం చేసుకుని మణిశర్మ దీనికి తగ్గట్టే సాంగ్ ను కంపోజ్ చేశారు.