అక్కినేని తండ్రీ కొడుకులు నాగార్జున(Nagarjuna ) – నాగచైతన్య(Naga Chaitanya) మీరోలుగా తెరకెక్కిన సినిమా బంగార్రాజు.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈమూవీ ఓటీటీ రిలీజ్ దిశగా అడుగులు వేస్తోంది.

 అక్కినేని తండ్రీ కొడుకులు నాగార్జున(Nagarjuna ) – నాగచైతన్య(Naga Chaitanya) మీరోలుగా తెరకెక్కిన సినిమా బంగార్రాజు.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈమూవీ ఓటీటీ రిలీజ్ దిశగా అడుగులు వేస్తోంది.

నాగార్జున (Nagarjuna ),నాగచైతన్య (Naga Chaitanya) హీరోలుగా నటించిన సినిమా బంగార్రాజు(Bangarraju). 2016 లో రిలీజ్ అయిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీకి... కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. నాగార్జున (Nagarjuna ) సరసన హీరోయిన్ గా రమ్మకృష్ణ నటించగా.. నాగచైతన్య జోడీగా యంగ్ స్టార్ కృతి శెట్టి నటించింది.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై బంగార్రాజు(Bangarraju)  సినిమాని నిర్మించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేశారు. సంక్రాంతికి సీజన్ కావడం..పెద్ద సినిమాలు ఏవీ పోటీకి లేకపోవడం బంగార్రాజు(Bangarraju) కు బాగా కలిసి వచ్చింది. సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. సూపర్ హిట్ అయ్యింది. మూవీ.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సిస్ లో కూడా సత్తా చాటింది. ఈమూవీ ఓవర్ ఆల్ గా దాదాపుగా 70 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. రీసెంట్ గా బంగార్రాజు (Bangarraju) సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది. ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ దిశగా పరుగులు తీస్తోంది. ఈ నెల 18 నుంచి జీ 5లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు టీమ్.
ఈ మూవీ సక్సెస్ అనూప్ రూబెన్స్ పాటలు కీలకమైన పాత్రను పోషించాయి. అచ్చమైన ఆధ్ర స్లాంగ్ తో పాటు సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramya Krishna) .. బ్యూటీ క్వీన్ కృతి శెట్టి గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. అంతే కాదు చాలా కాంగా హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న నాగార్జున(Nagarjuna )కు సంక్రాంతి విజయం జోష్ ను నింపింది. చాలా తక్కువ టైమ్ లో 50 కోట్ల కలెక్షన్ మార్క్ ను దాటిన బంగార్రాజు (Bangarraju) .. దాదాపు 70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని అంచనా.