టాలీవుడ్ నవ మన్మథుడి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సోగ్గాడే చిన్ని నయన సినిమాకు సీక్వెల్ సెట్టయిన సంగతి తెలిసిందే. బంగార్రాజు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. అయితే సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ నాగ్ అనుకున్నాడు. 

కానీ ఎలక్షన్స్ హడావుడి ముగిశాక జూన్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలెట్టాలని బంగార్రాజు గ్యాంగ్ డిసైడ్ అయ్యింది. ఈ సీక్వెల్ కి కూడా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు సినిమా స్క్రిప్ట్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. 

ఇక సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నారు. సీక్వెల్ లో నాగ చైతన్య బంగార్రాజు మనవాడి పాత్రలో నటించడానికి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం నాగార్జున బాలీవుడ్ బ్రహ్మాస్త్ర అలాగే మన్మథుడు సీక్వెల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.