క‌ళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్టర్‌. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించాడు. సంక్రాంతికి థియేటర్లలో విడుదలై  హిట్టయిన ఈ మూవీ ఓటిటిలోనూ బాగానే వర్కవుట్ అయ్యింది. ఇక ఈ చిత్రం దర్శకుడుకి మంచి ఆఫర్ తెచ్చి పెట్టిందని వినికిడి. 


కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `బంగార్రాజు`. 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు' అనేది ఉపశీర్షిక. క‌ళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్టర్‌. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించాడు. సంక్రాంతికి థియేటర్లలో విడుదలై హిట్టయిన ఈ మూవీ ఓటిటిలోనూ బాగానే వర్కవుట్ అయ్యింది. ఇక ఈ చిత్రం దర్శకుడుకి మంచి ఆఫర్ తెచ్చి పెట్టిందని వినికిడి. 

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఓ స్టార్ హీరోతో సినిమా ఓకే చేయించుకున్నారు. ఆ హీరో మరెవరో కాదు శివ కార్తికేయన్. తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. తమిళంలో స్టార్ నిర్మాతగా వెలుగుతున్న జ్ఞాన‌వేల్ రాజా నిర్మాత‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తారు. ఈ సినిమా కోసం శివ‌కార్తికేయ‌న్ రూ.20 కోట్ల పారితోషికం అందుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే క‌ల్యాణ్ కృష్ణ‌కు ఈ ఆఫ‌ర్ రావటం ఎవరూ ఊహించలేదు.జ్ఞాన‌వేల్ రాజా ఈ ప్రాజెక్టు సెట్ చేసినట్లు తెలుస్తోంది. `సోగ్గాడే.. ` త‌ర‌వాత కళ్యాణ్ కృష్ణ చేసిన సినిమాల‌ు ఏవీ వర్కవుట్ కాలేదు. `బంగార్రాజు` సంక్రాంతి కు వచ్చి ఒడ్డున పడేసింది. దాంతో మళ్లీ ఓ సోషియో ఫాంటసీ కథతో శివకార్తికేయన్ ఓకే చేయించుకున్నట్లు సమాచారం. త్వ‌ర‌లోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివ‌రాలు అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

ఇక ప్రస్తుతం శివకార్తికేయన్ ...డాన్ సక్సెస్ తర్వాత హీరోగా నటిస్తున్న చిత్రం ప్రిన్స్. జాతిరత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రూపొందుతోంది. . దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.