బండ్ల వర్సెస్ పవన్ ఫ్యాన్స్... గబ్బర్ సింగ్ విషయంలో ముదిరిన వివాదం!
పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య గబ్బర్ సింగ్ మూవీ రెమ్యూనరేషన్ గురించి అడిగారు. నిర్మాతగా ఉన్న బండ్ల గణేష్ రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చాడని అడిగారు. దానికి పవన్ ''నేను అనుకున్నంత ఇవ్వలేదు తాను ఇవ్వాలనుకున్నంత ఇచ్చాడు'' అని సమాధానం చెప్పాడు.

భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని కొన్నాళ్లుగా టార్గెట్ చేస్తున్నారనే అనుమానాలున్నాయి. నిఘాడంగా ఉండే ఆయన ట్వీట్స్ పవన్ ని ఉద్దేశించే అనే వాదన ఉంది. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ కూడా బండ్ల గణేష్ మీద కోపంగా ఉన్నారు. బండ్ల గణేష్ ట్వీట్స్ క్రింద ఫ్యాన్స్ కామెంట్స్ చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ఈసారి బండ్ల గణేష్ నేరుగానే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. ఆయన ట్వీట్ చాలా పరుషంగా ఉంది.
పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య గబ్బర్ సింగ్ మూవీ రెమ్యూనరేషన్ గురించి అడిగారు. నిర్మాతగా ఉన్న బండ్ల గణేష్ రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చాడని అడిగారు. దానికి పవన్ ''నేను అనుకున్నంత ఇవ్వలేదు తాను ఇవ్వాలనుకున్నంత ఇచ్చాడు'' అని సమాధానం చెప్పాడు. పవన్ కామెంట్స్ గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా పవన్ మార్కెట్ ప్రకారం పూర్తి రెమ్యూనరేషన్ చెల్లించలేదనే వాదన మొదలైంది. అలాగే ఈ కారణంతోనే పవన్ బండ్ల గణేష్ తో మూవీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలో బండ్ల గణేష్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓ నెటిజన్ బండ్ల గణేష్ కి మద్దతుగా ట్వీట్ వేశారు. నువ్వు ఆయన్ని దైవంలా భావిస్తావు. ప్రేమిస్తావు. ఆయనేమో ఒక పబ్లిక్ షోలో నీ పరువు తీసేశాడంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ట్యాగ్ చేసిన బండ్ల గణేష్ ''నా విశ్వరూపం చూపిస్తా...'' అని ఫైర్ ఎమోజీలు పోస్ట్ చేశారు. పవన్ చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంట్లా అన్నట్లు ఆయన కామెంట్ ఉంది.
ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు. నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. కత్తి మహేష్, శ్రీరెడ్డి మాదిరి బండ్ల గణేష్ తయారయ్యాడని విమర్శిస్తున్నారు. మరోవైపు బండ్ల గణేష్ ని పవన్ దూరం పెట్టాడనే ప్రచారం జరుగుతుంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానం దక్కలేదని దర్శకుడు త్రివిక్రమ్ మీద బండ్ల గణేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డు బయటకు వచ్చింది.
బండ్ల గణేష్ సదరు ఆడియోలో ఉంది నా వాయిస్ కాదని సమర్ధించుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆ వాయిస్ నాదే, త్రివిక్రమ్ కి సారీ చెప్పానని ఒప్పుకున్నాడు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఘటన తర్వాత బండ్ల గణేష్ పవన్ తో కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలో బండ్ల గణేష్ ట్వీట్స్, కామెంట్స్ తరచుగా చర్చకు దారితీస్తూ ఉంటాయి.