బండ్ల గణేష్ అంటే టాలీవుడ్ లో ఓ క్రేజ్ ఉంది. మనసులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పే వ్యక్తిత్వం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కి వచ్చిన బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ నిర్మాతగా మారాడు.

బండ్ల గణేష్ అంటే టాలీవుడ్ లో ఓ క్రేజ్ ఉంది. మనసులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పే వ్యక్తిత్వం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కి వచ్చిన బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ నిర్మాతగా మారాడు. కెరీర్ ఆరంభంలో కామెడీ వేషాలు వేసిన బండ్ల గణేష్.. ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న తర్వాత నిర్మాతగా మారాడు. 

నిర్మాతగా బండ్ల గణేష్ కు ఆరంభంలో పరాజయాలే ఎదురయ్యాయి. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం బండ్ల గణేష్ దశ తిరిగేలా చేసింది. ఆ తర్వాత బండ్ల గణేష్ బాద్షా, టెంపర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించాడు. 

గత ఏడాది బండ్ల గణేష్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో నటుడిగా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే బాటలో బండ్ల గణేష్ మరికొన్ని చిత్రాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే తాజాగా బండ్ల గణేష్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. బండ్ల గణేష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. 

తాజాగా ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్1గా స్వాతి చంద్ర నిర్మిస్తున్న సినిమాలో బండ్ల గణేష్ హీరోగా నటించనున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'కి‌ రీమేక్ ఇది.

తమిళంలో ఆర్ పార్తిబన్ ప్రధాన పాత్రలో నటించారు. తెలుగు రీమేక్ కి బండ్ల గణేష్ అయితే పర్ఫెక్ట్ అని నిర్మాతలు ఆయన్ని సంప్రదించారట. బండ్ల గణేష్ వెంటనే అంగీకరించారు. మామూలుగానే మైక్ పట్టుకుంటే బండ్ల గణేష్ డైలాగుల మోత మోగిస్తాడు. అలాంటి ఏకంగా హీరో పాత్రలో నటించనుండడంతో పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.