రాజకీయాల్లోనూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బండ్ల గణేష్‌ ఇప్పుడు సినిమాల్లో నటుడిగా బిజీ అవుతున్నారు.  ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ కి గుడ్‌బై చెప్పేస్తానని ప్రకటించారు. 

బండ్ల గణేష్‌ అంటే సంచలనాలకు కేరాఫ్‌. ఆయన మాట్లాడే ప్రతి మాట ఓ సంచలనమే. ఆయన చేసే పని సంచలనమే. పవన్‌ కళ్యాణ్‌ భక్తుడిగా ఆయన స్టేజ్‌పై మాట్లాడితే అదో సంచలనం. తన బోల్డ్ స్పీచ్‌లతో కడుపుబ్బ నవ్వించడంలోనూ ఆయన సంచలనం సృష్టిస్తారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కమెడీయన్‌గా రాణిస్తూ, ఉన్నట్టుండి నిర్మాతగా మారి స్టార్‌ హీరోలతో భారీ సినిమాలు నిర్మించి సంచలనం సృష్టించారు. రాజకీయాల్లోనూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బండ్ల గణేష్‌ ఇప్పుడు సినిమాల్లో నటుడిగా బిజీ అవుతున్నారు. 

ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ కి గుడ్‌బై చెప్పేస్తానని ప్రకటించారు. శనివారం ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు, అందుకే ట్విట్టర్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. `త్వరలోనే ట్విట్టర్‌ కి గుడ్‌బై చెప్పేస్తా. నాకు ఎలాంటి వివాదాలు వద్దు. నా జీవితంలో వివాదాలకు తావివ్వకుండా జీవించాలనుకుంటున్నా` అని ట్వీట్‌ చేశారు బండ్ల గణేష్‌. దీంతో ఆయన అభిమానులు షాక్‌కి గురయ్యారు. సోషల్‌ మీడియాలో ఇలాంటివి కామనే అన్నా, లైట్‌ తీస్కో అంటూ ఆయన్ని సముదాయించే పనిలో పడ్డారు. అదే సమయంలో `ఎందుకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏమైందో చెప్పండి` అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. మరి ఆ కారణం ఏంటో బండ్ల గణేష్‌ ఎప్పుడు రివీల్‌ చేస్తాడో చూడాలి. 

Scroll to load tweet…

ప్రస్తుతం నటుడిగా బిజీ అవుతున్నాడు బండ్ల గణేష్‌. `సరిలేరు నీకెవ్వరు`లో మరోసారి తనదైన కామెడీతో మెప్పించారు. ఇప్పుడు `క్రేజీ అంకుల్స్` చిత్రంలో ప్రొడ్యూసర్‌ రోల్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అక్కడ కూడా తన రియల్‌ లైఫ్‌ స్టయిల్‌ని చూపించారు బండ్ల గణేష్‌.