సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఆయన చేసిన  ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా  మారింది. 

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఆయన చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఆయన తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరి బండ్ల గణేష్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడటానికి కారణమేటింటే.. తారకరత్న‌ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. అక్కడే ఉన్న విజయసాయిరెడ్డితో మాట్లాడారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి విజయసాయిరెడ్డికి వరుసకు కూతురు అవుతుంది. విజయసాయి రెడ్డి భార్య సోదరి కూతురే అలేఖ్య రెడ్డి. 

Scroll to load tweet…

ఈ క్రమంలోనే తారకరత్న మృతితో విషాదంలో ఉన్న అలేఖ్య రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు విజయసాయిరెడ్డి అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చినవారితో నందమూరి కుటుంబ సభ్యులు, ఇతరులతో ఆయన మాట్లాడటమే కాకుండా తదరుపరి జరగాల్సిన కార్యక్రమాల గురించి చర్చిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబు, బాలకృష్ణ తదితరులతో విజయసాయిరెడ్డి మాట్లాడారు. 

అయితే రాజకీయంగా ప్రత్యర్థులైన చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చొని మాట్లాడుతున్న ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే తారకరత్నకు ఇరువైపులా బంధువులు కావడంతో.. విషాద సమయంలో చేయాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నారని అంతా భావిస్తున్నారు. చాలా వరకు ఈ ఘటనకు ఎలాంటి దురుద్దేశాలు అపాదించలేదు. 

Scroll to load tweet…

అయితే బండ్ల గణేష్ మాత్రం ఈ ఫోటోను షేర్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. తాను ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వ్యక్తితో ఈ విధంగా కూర్చొని మాట్లాడనని అన్నారు. బతికితే సింహంలా బతకాలి.. చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలని కూడా పేర్కొన్నారు. ‘‘నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!!’’ బండ్ల గణేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

అయితే ఆయన బండ్ల గణేష్ తీరును తప్పుబడుతూ పలువురు నెటిజన్లను ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక, ఇటీవలికాలంలో ట్విట్టర్‌లో బండ్ల గణేష్ చేస్తున్న పోస్టులు.. తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. పలు సందర్భాల్లో ఆయన ట్వీట్స్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.