మహేష్ బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'  ద్వారా యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.  నిన్న మొన్నటిదాకా రూమర్స్ గా ఉన్న ఈ విషయాన్ని  చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటన చేసి ధృవీకరించింది.  అంతేకాదు ఈ సినిమాలో ఆయన కోసం దర్శకుడు ప్రత్యేకమైన పాత్రను రాసినట్లు తెలిసింది.  కథను మలుపు తిప్పే రోల్ లో బండ్ల గణేష్ నటిస్తున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది.  

అంతా బాగానే ఉంది కానీ మధ్యలో ఓ కొత్త టాపిక్ ఈ ప్రకటనతో మొదలైంది. అదేమిటంటే.. ఈ సినిమాకు బండ్ల గణేష్ రెమ్యునేషన్ ఎంత తీసుకోబోతున్నాడు అని. ఈ విషయం సోషలో మీడియాలో  చర్చనీయాంసంగా మారింది.  అయితే కొన్ని మీడియా సంస్దలు ఇందుకు సమాధాన మిచ్చేసాయి.  రోజుకు ఐదు లక్షలు చొప్పున బండ్ల గణేష్ కు ఇవ్వనున్నారు అని రాసేసాయి. 

కానీ అక్కడే అందరికీ డౌట్ మొదలైంది.   ఓ కమిడియన్ కు ఈ స్దాయి రెమ్యునేషన్ ఎవరిస్తారు. ఎంత బండ్ల గణేష్ కు   క్రేజ్  ఉంటే మాత్రం ఇస్తారా అని అంటున్నారు.  ఎందుకంటే.. బండ్ల గణేష్ అనే కమెడియన్ ఉన్నాడనే విషయమే ఈ జనరేషన్ కు  తెలియదు. ఆయన  ఏమీ ఫామ్ లో లేడు. అంతకు మించి సీన్ లేదు. మీడియా లో వచ్చిన వార్తలను బట్టి లెక్కేస్తే..  పది రోజులు డేట్స్ తీసుకుంటే  50 లక్షలు ఇవ్వాలి.  బండ్ల గణేష్ తీసుకోవచ్చేమో కానీ ..ఇచ్చేదెవరు.. లేక ఒక రోజులోనే షూటింగ్ ఫినిష్ చేసి పంపించేస్తారా.. ? ఇదంతా చూస్తూంటే బండ్లకి హైప్ ఇవ్వడానికి ఆయనకు అనుకూలంగా ఉన్న కొన్ని వెబ్ సైట్స్ అల్లిన ప్రచారము అని తెలుస్తోంది.

ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి, రాజేంద్రప్రసాద్‌, బండ్ల గణేష్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి అయ్యింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సంగీత కూడా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది.