Asianet News TeluguAsianet News Telugu

హాట్ టాపిక్ గా మారిన బండ్ల గణేష్ న్యూస్

చాలాకాలం గ్యాప్ తీసుకుని మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కామెడీ పాత్రలో ఎంట్రీ ఇచ్చారు బండ్ల గణేష్. అయితే ఆ సినిమా లో అతని పాత్ర క్లిక్ అవ్వలేదు సరికదా చాలా ట్రోలింగ్ కు గురి అయ్యింది. దాంతో నటుడుగా కొనసాగాలేనే ఆలోచనను విరమించుకుని నిర్మాతగా బిజీ అవుదామనుకున్నారు బండ్ల గణేష్. అయితే ఆయన మనస్సు మరోసారి మార్చుకున్నారు. ముఖానికి రంగేసుకుని తెరపై కనిపించటానికి రెడీ అయ్యినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఓ చిత్రం కోసం సైన్ చేసినట్లు సమాచారం. ఇంతకీ ఏమిటా చిత్రం...ఆ వివరాలు చూద్దాం...

Bandla Ganesh Okay Another Comedy Role jsp
Author
Hyderabad, First Published Feb 8, 2021, 4:47 PM IST

మారుతి, గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో కామెడీ క్యారక్టర్ చేయటానికి బండ్ల గణేష్  కమిటయ్యారని తెలుస్తోంది.  ప్ర‌తిరోజూ పండ‌గే త‌ర‌వాత‌…. మారుతి మ‌రో సినిమా ప్రారంభించలేదు. కరోనా లేకుండా వుండివుంటే ఈ పాటికి దర్శకుడు మారుతి రెండు సినిమాలు అందించేసి వుండేవారు. కానీ పరిస్థితులు కలిసిరాలేదు.  హీరోల డేట్లూ కలిసిరాలేదు. ఆఖరికి ఇప్పటికి ప్రాజెక్ట్ అనౌన్స్  మెంట్ వచ్చింది. గోపీచంద్ తో సినిమా చేయబోతున్నట్లు, దాని టైటిల్ వగైరా వివరాలు ప్రకటించబోతున్నట్లు, చిన్న కాన్సెప్ట్ విడియో కట్ చేసి వదిలారు.

 మారుతి తీయబోయే సినిమాలో హీరో లాయిర్ గా కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చేసాయి.  పక్కా కమర్షియల్ సినిమాలు తీసే మారుతి ఈ సినిమాకు ఈసారి కూడా అలాంటి 'పక్కా కమర్షియల్' టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. యూవీ, గీతా ఆర్ట్స్ కలిసి తీయ‌బోయే ఈ చిత్రం భారీగానే రూపొందుతోంది. ఇందులో గోపిచంద్ ది లాయ‌ర్ పాత్ర‌. ఫీజు కోసం ఎలాంటి కేసునైనా వాదిస్తుంటాడ‌ట‌. అందుకే.. `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` అనే టైటిల్ సూట‌వుతుంద‌ని మారుతి భావిస్తున్నాడు. 

అలాగే బండ్ల గణేష్ పాత్ర సినిమాలో ఫన్ తో పాటు కథను మలుపు తిప్పే చిన్న ట్విస్ట్ తో ఉంటుందని తెలుస్తోంది. అందుకే బండ్ల గణేష్ ఒప్పుకున్నాడంటున్నారు. వాస్తవానికి మారుతి డైరక్షన్ లో ప్రతిరోజూ పండగే సినిమా లో కూడా బండ్ల నటించాల్సింది. కానీ రకరకాల కారణాలతో చాన్స్ మిస్ చేసుకున్నాడు. ఇన్నాళ్లకు మళ్లీ అవకాసం వచ్చింది. ఈ సారి వదులుకోదలుచుకోలేదట. దానికి తోడు బండ్ల గణేష్ కు మంచి పేమెంట్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.   
 

Follow Us:
Download App:
  • android
  • ios