బండ్ల గణేష్‌ హీరోగా వెండితెరపై విశ్వరూపం చూపించబోతున్నారు. వెంకట్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్‌ని ప్రకటిస్తూ, ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి `డేగల బాబ్జీ` అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నటుడిగా, నిర్మాతగా మెప్పించిన ఆయన ఇకపై హీరోగా వెండితెరపై విశ్వరూపం చూపించబోతున్నారు. వెంకట్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్‌ని ప్రకటిస్తూ, ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి `డేగల బాబ్జీ` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో బండ్ల గణేష్‌ అదరగొడుతున్నారు.

ఇందులో బండ్ల గణేష్‌ తలకి ఎర్రని క్లాత్‌ని చుట్టుకున్నారు. ఎడవ వైపు కంటి నుదుటిపై రక్తం కారుతుండగా, మరోవైపు చేయి అడ్డు పెట్టుకుని కోపంతో, ఆవేశంతో చూస్తున్న బండ్ల గణేష్‌ లుక్‌ గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. ఈ ఫస్ట్ లుక్‌ని దర్శకుడు హరీష్‌ శంకర్‌ విడుదల చేయడం విశేషం. ఈ సందర్భంగా హరీష్‌ శంకర్‌కి ధన్యవాదాలు తెలిపారు బండ్ల గణేష్‌. తన నటన కెరీర్‌లో ఇదొక అద్భుతమైన అనుభవం అని, ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్‌ చంద్రకి ధన్యవాదాలు తెలిపారు బండ్ల గణేష్‌.

Scroll to load tweet…

ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. వెంకట్‌ చంద్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాతలు స్పందిస్తూ, `తమిళ హిట్ చిత్రం `ఒత్తు సెరుప్పు సైజ్ 7`కి‌ రీమేక్ ఇది. తమిళంలో ఆర్. పార్థిబన్‌ పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందరికీ సర్‌ప్రైజ్. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నాన్‌స్టాప్‌గా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాం` అని చెప్పారు.