ఇంటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను నేపాలీకి చెందిన పాపని పెంచుకుంటున్నట్టు తెలిపారు బండ్ల గణేష్‌. అందరు కుక్కులు, పిల్లులు పెంచుకుని, వాటి కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. తాను మాత్రం పాపని పెంచుకుంటున్నట్టు చెప్పారు. 

నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌(Bandla Ganesh) హీరోగా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన నెటిజన్ల ప్రశంసలందుకుంటున్నారు. Bandla Ganesh చేసిన పనికి అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్ను విమర్శించే వారు ఇప్పుడు ఎవరూ ఉండరంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఇంతకి బండ్ల గణేష్‌ ఇంతటి ప్రశంసలందుకోవడానికి కారణం ఆయన ఓ చిన్నారిని దత్తత తీసుకోవడమే. చాలా రోజుల క్రితం బండ్ల గణేష్‌ ఓ పాపని దత్తత తీసుకున్నారట. 

ఇంటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను నేపాలీకి చెందిన పాపని పెంచుకుంటున్నట్టు తెలిపారు. అందరు కుక్కులు, పిల్లులు పెంచుకుని, వాటి కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. తాను మాత్రం పాపని పెంచుకుంటున్నట్టు చెప్పారు. తన భార్య కోరిక మేరకు ఆ పాపని దత్తత తీసుకున్నట్టు తెలిపారు బండ్ల గణేష్‌. ఇప్పుడు ఆ పాప తమ ఇంట్లో మెంబర్‌ అయ్యిందని, మమ్మల్ని, మా పిల్లలను బెదిరించే స్థాయికి పెరిగిందని తెలిపారు బండ్ల గణేష్‌. ఆ చిన్నారి గురించి చెబుతూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాపని బాగా చదివించాలనుకుంటున్నట్టు చెప్పారు.

Scroll to load tweet…

అయితే ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. అభిమానులు బండ్ల గణేష్‌ చెప్పిన ఇంటర్వ్యూ వీడియో క్లిప్‌ని షేర్‌ చేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని విమర్శించే వారే లేరు. గొప్ప మనసుని చాటుకున్నావ్‌ అన్నా అంటూ అభినందిస్తున్నారు. పవన్‌కి నిజమైన అభిమానివి అనిపించుకున్నావ్‌ అన్నా అంటున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో బండ్ల గణేష్‌ వైరల్‌గా మారారు. 

కమెడీయన్‌గా మెప్పించిన బండ్ల గణేష్‌ ఆ తర్వాత నిర్మాతగా మారారు. భారీ సినిమాలు తీసి సక్సెస్‌ అందుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ని ఆయన దైవంగా భావిస్తుంటాడు. దేవరగా పిలుచుకుంటారు. పవన్‌ అభిమానిగానూ మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు బండ్ల గణేష్‌. మరోవైపు రాజకీయాల్లోకి వెళ్లి వచ్చారు. ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో కామెడీ రోల్‌ చేసి మెప్పించిన ఆయన ఇప్పుడు ఏకంగా హీరోగా పరిచయం కాబోతుంది. `డేగల బాబ్జీ` పేరుతో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. క్రైమ్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచింది.

also read: Allu Arjun: `మెగా` కాదు, `అల్లు`నే ఫస్ట్.. ఎన్టీఆర్‌తో పోల్చడం వెనకాల బన్నీ ఉద్దేశ్యం అదేనా?