మహేష్ లుంగీ కడితే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందట..!

First Published 5, Apr 2018, 3:34 PM IST
ban is a hit because mahesh wears lungi
Highlights
మహేష్ లుంగీ కడితే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందట..!

బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయింది. స్పైడర్ సినిమా డబుల్ డిజాస్టర్ అయింది. ఇలాంటి రెండు చారిత్రక డిజాస్టర్ల తర్వాత భరత్ అనే నేను సినిమా వస్తోంది. మరి ఈ సినిమాకు హైప్ తీసుకురావడం ఎలా? అందుకే రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు ఫ్యాన్స్. సినిమా ఎలాగైనా హిట్ అవుతుందని చెప్పేందుకు లేనిపోని లాజిక్కుల్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే మహేష్ లుంగీ గెటప్.

అవును.. మహేష్ లుంగీ కడితే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందట. పోకిరిలో ఓ పాటలో మహేష్ లుంగీ కట్టాడు. కాబట్టే అది సూపర్ హిట్ అయిందట. ఇక శ్రీమంతుడులో లుంగీ కట్టాడు కాబట్టే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిందట. తాజాగా భరత్ అనే నేను సినిమాకు సంబంధించి కూడా ఓ లుంగీ స్టిల్ బయటకొచ్చింది. సో.. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. ఇదేం లాజిక్కో అర్థంకాక జనాలు తల పట్టుకున్నారు.

అసలు ఈ టైమ్ లో లుంగీ స్టిల్ విడుదల చేయడానికి కారణం కూడా ఇదేనంటూ ఓ ప్రచారం సాగుతోంది. మొన్నటివరకు భరత్ అనే నేను సినిమాకు సంబంధించి ప్రచారమంతా పొలిటికల్ యాంగిల్ లో సాగింది. మహేష్ కూడా ఇన్-షర్ట్ లో నీట్ గా, అఫీషియల్ గా కనిపించాడు. కానీ సడెన్ గా లుంగీ కట్టి స్టెప్పేసే స్టిల్ రిలీజ్ చేశారు. ఈ స్టిల్ విడుదల వెనక ఫ్యాన్స్ లుంగీ సెంటిమెంట్ ఉందంటూ ప్రచారం సాగుతోంది.

లుంగీ కడితే సినిమా హిట్ అవుతుందనేది కేవలం సెంటిమెంట్ మాత్రమే. కంటెంట్ బాగుంటే లుంగీ కట్టకపోయినా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. కానీ ఇది 'సెంటిమెంటల్' పరిశ్రమ. సక్సెస్ కోసం పేర్లు, స్పెల్లింగులు కూడా మార్చుకునే ఇండస్ట్రీ ఇది. సో.. ఇలాంటి సెంటిమెంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. దీనికి ఫ్యాన్స్, నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఎవరూ అతీతం కాదు. చూసి నవ్వుకోవడం తప్ప ఏం చేయలేం.

loader