2003లో బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ నర్తనశాల ప్రారంభించారు. ఈ చిత్రాన్ని ఆయన స్వీయ దర్శకత్వంలో మొదలుపెట్టారు. అలాగే ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఈ మూవీ మారింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలనుకున్న ఈ మూవీ సౌందర్య అకాల మరణంతో ఆగిపోయింది. 2004 ఎన్నికల ప్రచారం సంధర్భంగా సౌందర్య ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో ఆమె మరణించారు. నర్తనశాల మూవీలో ఆమె కీలకమైన ద్రౌపది పాత్ర చేస్తున్నారు. అప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీలో అర్ధాంతరంగా ఆగిపోయింది. 

ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న  విడుదలవుతుంది. 

ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు. ఎన్నాళ్ళగానో నర్తనశాల కోసం రూపొందించిన సన్నివేశాలను చూడాలన్న కోరిక ఈ నెల 24 నుండి నెరవేరబోతోంది. ఇది వార్త నందమూరి అభిమానులలో ఫుల్ జోష్ నింపింది.