‘అఖండ’ ట్రైలర్..ఇంట్రస్టింగ్ ఇన్ఫో
ప్రస్తుతం కరోనా తో షూటింగ్ ఆగిపోవటంతో.. ఈ చిత్రం ట్రైలర్ పై బోయపాటి పూర్తి దృష్టి పెట్టిన్నట్లు సమాచారం. ఈ మేరకు ఎడిటర్స్ తో ఇప్పటికే ట్రైలర్ రఫ్ వెర్షన్స్ కట్ చేయించారట.
సింహా,లెజెండ్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో చిత్రం ‘అఖండ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా అప్డేట్స్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కరోనా తో షూటింగ్ ఆగిపోవటంతో.. ఈ చిత్రం ట్రైలర్ పై బోయపాటి పూర్తి దృష్టి పెట్టిన్నట్లు సమాచారం. ఈ మేరకు ఎడిటర్స్ తో ఇప్పటికే ట్రైలర్ రఫ్ వెర్షన్స్ కట్ చేయించారట. మూడు వెర్షన్స్ కట్ చేసి అందులో బాలయ్య,బోయపాటి ఇద్దరికి నచ్చిన వెర్షన్ ని వదులుతారుట.
మరి ఈ ట్రైలర్ ని ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అంటే సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసాక, ప్రి రిలీజ్ పంక్షన్ లో వదలనున్నారు. వాస్తవానికి గత మే 28న మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుంది అని టాక్ వచ్చింది కానీ అది కాస్తా రాలేదు. దీంతో బాలయ్య అభిమానులు నిరాశకు గురయ్యారు. దాంతో జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ తోపాటు.. మరో టీజర్ కూడా విడుదలయ్యే చేయమని బాలయ్య చెప్పారట. అయితే ఆరోజున ఫస్ట్ సింగిల్ తో పాటుగా మరో టీజర్ ఉంటుందా ఉండదా అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఉండే అవకాసాలు మాత్రం ఉన్నాయి.
ఇప్పటికే ఉగాది పర్వదినం రోజున ఈ చిత్రానికి ‘అఖండ’అనే టైటిల్ ఖరారు చేసి టీజర్‌ని కూడా విడుదల చేసింది. గత సినిమాల మాదిరే సినిమా టైటిల్‌తో పాటు టీజర్ కూడా పవర్‌పుల్‌గా ఉండి జనాల్లోకి దూసుకుపోయింది. రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సంభందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. థియోటర్ డీల్స్ ఇప్పటికే క్లోజ్ అయ్యిపోయాయి. తాజాగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ డీల్ కూడా ఫినిష్ చేసినట్లు సమాచారం.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘అఖండ’ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా వారు తీసుకోగా, డిజిటల్ రైట్స్ ని హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. రెండు డీల్స్ కలిసి 15 కోట్లుకు క్లోజ్ చేసారని సమాచారం. బాలయ్య సినిమాల విషయానికి వస్తే ఇది మంచి డీల్. కెరీర్ లో బెస్ట్ డీల్ అంటున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ విషయానికి వస్తే..ఇంకా పదిహేను రోజులు పెండింగ్ ఉంది.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. మరో హీరోయిన్ పూర్ణ డాక్టర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాంత్, పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.