Asianet News TeluguAsianet News Telugu

వీరసింహారెడ్డి విజయోత్సవం, ఒక్క థియేటర్ లో 200 రోజులు ఆడిన బాలయ్య సినిమా..

బాలయ్య బాబు ఏమాత్రం తగ్గేది లేదంటున్నాడు.  వరుసగా సినిమాలుసెట్స్ ఎక్కించడంతో పాటు.. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. అంతే కాదు వరుస రికార్డ్ లు కూడా క్రియేట్ చేస్తున్నాడు బాలయ్య. 
 

Balayya Veera Simha Reddy Movie Completes 200 Days Run JMS
Author
First Published Jul 30, 2023, 7:56 AM IST

తాజాగా రేర్ ఫీట్ సాధించింది బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీ.  200 రోజులు ఒక్క థియేటర్ లో నిర్విరామంగా షోలు పడుతూ..సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది సినిమా. నట సింహం నంద‌మూరి బాలకృష్ణ హీరోగా, శృతి హాసన్, హానీరోజ్ హీరోయిన్స్ గా న‌టించిన సినిమా వీరసింహారెడ్డి.  గోపీచంద్ మలినేని  డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాను  మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. 

ఈ ఏడాది  సంక్రాంతి కానుగా రిలీజ్ అయిన వీరసింహారెడ్డి  సినిమా.. బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది.  మాస్ యాక్షన్  అండ్ సెంటిమెంట్ సమపాళ్లలో కలగలిపిన సినిమా ఇది.   అభిమానుల‌ను అల‌రించి భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది వీరసింహారెడ్డి. అంతే కాదు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర  క‌లెక్ష‌న్ల వర్షం కురిపించిన ఈమూవీ బాలయ్య కెరీర్ లో రెండోసారి 100 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. భారీ కలెక్షన్లను సునాయాసంగా  రాబ‌ట్టిందీ సినిమా. 

వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ నుంచి అభిమానులను అలరిస్తూనే ఉంది. తాజాగా ఈసినిమా ఓ ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. ఓ థియేట‌ర్‌లో 200 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డ్ సాధించింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన వీరసింహారెడ్డి.. ఈ సినిమా ఏప్రిల్ 21తో 100 రోజుల‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ఈ శ‌క్ర‌వారంతో 200 రోజులు పూర్తి చేసుకుంది. కర్నూల్‌ అలూరిలోని ఎస్ఎల్ఎన్ఎస్ థియేట‌ర్‌లో  ఈ 200 రోజుల  మైలురాయిని చేరుకుంది సినిమా.

Follow Us:
Download App:
  • android
  • ios