Asianet News TeluguAsianet News Telugu

యంగ్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌తో హీరోగా మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఖరారు? ఈ సారైనా మోక్షం కలుగుతుందా?

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఎప్పుడనేది ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త రూమర్‌ తెరపైకి వచ్చింది. యంగ్‌ క్రియేటివ్ డైరెక్టర్‌తో సినిమా ఓకే అయ్యిందట. 

balayya son mokshagna tollywood entry with young creative director
Author
First Published Sep 7, 2022, 8:03 PM IST

నందమూరి నటసింహాం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఓ కలగా మిగిలిపోనుందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గత ఐదారు ఏళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ అప్పుడే, ఇప్పుడే, ఆ డైరెక్టర్‌తో, ఈ డైరెక్టర్‌తో అంటూ వార్తలు వినిపించాయి. అవేవీ నిజం కాలేదు. కానీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఆ మధ్య బాలకృష్ణనే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చెప్పారు. తన డైరెక్షన్‌లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని, `ఆదిత్య 369`కి సీక్వెల్‌ చిత్రంతో అతని ఎంట్రి ఇవ్వబోతున్నట్టు తెలిపారు బాలయ్య. తనే దర్శకత్వం వహిస్తారని కూడా చెప్పారు. కానీ ఇది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

మోక్షజ్ఞకి సినిమాలపై ఆసక్తి లేదనే వార్తలు కూడా బయటకొచ్చాయి. వ్యాపారాలపై ఆయన ఫోకస్‌ ఉందని, యాక్టింగ్‌పై లేదని వార్తలు లీక్‌ అయ్యాయి. కానీ బాలయ్య బలవంతంగా కొడుకుని మోటివేట్‌ చేస్తున్నారని, అందుకే సినిమా ఎంట్రీకి ఆలస్యమవుతుందని అంటున్నారు. దీనికితోడు మోక్షజ్ఞ కూడా లావుగా కనిపిస్తుండటం, హీరో అయ్యే ఆసక్తి ఆయనలో కనిపించకపోవడం గమనార్హం. తాజాగా ఆయన పుట్టిన రోజు జరిగింది. మంగళవారం `ఎన్బీకే107` సెట్‌(టర్కీ)లో యూనిట్‌ సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు మోక్షజ్ఞ. అందులోనూ ఆయన లావుగా, ఏమాత్రం బాడీ ఫిట్ గా లేకపోవడం గమనార్హం. 

కానీ ఇప్పటికీ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మోక్షజ్ఞని హీరోగా సినిమాకి దర్శకత్వం వహించేందుకు చాలా మంది దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఆ మధ్య బోయపాటి, ఇటీవల అనిల్‌ రావిపూడి పేర్లు ప్రధానంగా వినిపించగా, ఇప్పుడు మరో యంగ్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ పేరు వినిపిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా `టాక్సీవాలా`, `శ్యామ్‌ సింగరాయ్‌` దర్శకుడు రాహుల్‌ సాంక్రిత్యాన్‌ పేరు తెరపైకి రావడం ఆశ్చర్యపరుస్తుంది. 

రాహుల్‌ సాంక్రిత్యాన్‌.. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఓ కథని సిద్ధం చేశాడట. ఆ కథని ఇటీవల ఆయనకు వినిపించారని, స్టోరీ విషయంలో బాలయ్య, మోక్షజ్ఞ ఎగ్జైట్‌ అయ్యారని తెలుస్తుంది. లవ్‌ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించాలని భావిస్తున్నారని, అన్ని సెట్‌ అయితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios