బాలయ్య చెప్పిన టాప్ 5 హిట్ సినిమాల్లో కనిపించని బోయపాటి మూవీస్ సింహ, లెజెండ్ వంటి హిట్లను అందించిన బోయపాటి బోయపాటి స్థానంలో పూరికి చోటు కల్పించిన బాలయ్య

నందరమూరి నట సింహం.. బాలకృష్ణ.. తెరంగేట్రం చేసి 43 ఏళ్లు కావస్తోంది. ఈ 43ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన 101 సినిమాలు చేశారు. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్లుగా నిలవగా.. మరికొన్ని డీలా పడినవీ ఉన్నాయి. అయితే.. ఇటీవల బాలయ్య బాబు.. తన సినీ కెరిర్ లో ది బెస్ట్ గా నిలిచే 5 సినిమా పేర్లు చెప్పి బోయపాటికి షాక్ ఇచ్చాడు.

ఒకనొక సమయంలో బాలయ్య తీసిన అన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నప్పుడు బోయపాటి.. బాలకృష్ణకు ‘ సింహ’ సినిమాతో హిట్ ఇచ్చాడు. ఆ సినిమా బాలయ్య కు సెకండ్ ఇన్నింగ్ అని కూడా చెప్పవచ్చు. దాని తరువాత అదే స్థాయిలో లెజెండ్ సినిమాని అందించి బలాయ్య జాబితాలో మరో హిట్ ని చేర్చాడు బోయపాటి. ఇది అందరికీ తెలిసిన విషయమే.

అయితే.. బాలయ్య తన టాప్ 5 సినిమాల గురించి మాట్లుడుతూ వాటిలో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ‘శ్రీరామరాజ్యం’ ‘సమరసింహారెడ్డి’ ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ లతో పాటు తన మొదటి సినిమా ‘తాతమ్మకథ’ ను పేర్కొని అందరికీ షాక్ ఇచ్చాడు. అంతేకాదు ఈ 5 సినిమాలు మాత్రమే తన కెరీర్ లో వెరీ స్పెషల్ అని అంటున్నాడు బాలకృష్ణ. అంత పెద్ద హిట్ లను ఇచ్చిన బోయపాటి సినిమాల ప్రస్తావన ఎందుకు తేలాదంటూ సినీ జనాలు చర్చించుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా ‘పైసా వసూల్’ రిజల్ట్ ఇంకా తెలియకుండానే ఈమూవీ ఫలితంతో సంబంధం లేకుండా పూరికి మరో ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. తన 103 వ సినిమాను పూరిజగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు తామిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి వస్తుందని కూడ తెలిపాడు.

దీనితో బోయపాటితో బాలయ్య చేస్తాడు అనుకున్న ప్రాజెక్టు మరోసారి వెనక్కి వెళ్లింది. ఒక వైపు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఖచ్చితంగా బాలయ్యతో సినిమా ఉంటుందని బోయపాటి చెపుతూ ఉంటే బాలయ్య మాత్రం బోయపాటి స్థానంలో పూరి జగన్నాధ్ కు అవకాశం ఇవ్వడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..