పవన్ ని సూపర్ స్టార్ చేయడం నాకు ఇష్టం లేదు.. మేమే సూపర్ స్టార్స్ : బాలక్రిష్ణ

First Published 17, Mar 2018, 4:39 PM IST
Balayya satires on pawan kalyan
Highlights
  • మొన్నటివరకూ చంద్రబాబు వెంట తిరిగిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకున్నారు
  • హిందూపురంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం వచ్చిన బాలయ్య​
  • ఆయన్ను హీరోని చేయడం తనకు ఇష్టం లేదన్నారు బాలయ్య​

మొన్నటివరకూ చంద్రబాబు వెంట తిరిగిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకున్నారు. ‘యాంటీ టీడీపీ’ వైఖరితో చంద్రబాబును కార్నర్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడితో ఆగకుండా లోకేష్ మీద కూడా దాడి షురూ చేశారు. ‘లోకేష్ అవినీతి’ అనేది పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ తర్వాతే ఏపీలో హాట్ ఎలిమెంట్ గా మారింది. ఈ సెగ నేరుగా లోకేష్ మామయ్య నందమూరి బాలకృష్ణకు తాకింది. హిందూపురంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం వచ్చిన బాలయ్యను ‘పవన్ వ్యాఖ్యల’ మీద మీడియా వాళ్ళు రియాక్షన్ అడిగారు.

 

దానిపై స్పందించి ఆయన్ను హీరోని చేయడం తనకు ఇష్టం లేదన్నారు బాలయ్య. ‘ఆ మాటకొస్తే నేనే సూపర్ హీరోని’ అంటూ మరో సెటైర్ వేశారు. దీంతో.. పవన్ కళ్యాణ్ హీరోయిజం మీద బాలయ్య కామెంట్ చేసినట్లే అయ్యింది. దీన్ని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారనేది అప్రస్తుతం.ఇదిలా ఉంటే.. తెలుగుదేశం సంక్షోభంలో పడ్డ ప్రతిసారీ.. ఆ పార్టీ శ్రేణులకు తారక్ గుర్తుకు రావడం సహజం. ఈ సంక్లిష్ట సమయంలో పవర్ స్టార్ తాకిడి నుంచి బయటపడాలంటే చంద్రబాబుకు పక్కబలంగా జూనియర్ ఎన్టీయార్ ఉండాల్సిదేనంటూ తమ్ముళ్లు సూచిస్తున్నారు. ఈమేరకు తారక్ క్యాంప్ కి పిలుపు వెళ్లినట్లు కూడా తెలుస్తోంది. ‘తోటరాముడి’ రెస్పాన్స్ ఏమిటన్నది మాత్రం సస్పెన్స్. ఏదేమైనా.. ఏపీలో పవర్ పాలిటిక్స్  అటుతిరిగి.. ఇటు తిరిగి  ‘సినిమా టర్న్’ తీసుకున్న మాటైతే వాస్తవం.

                          

 

loader