రిలీజ్ అయ్యి నెల దాటినా ఇంకా ‘వకీల్ సాబ్’ ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ తిరిగి ఫామ్ లోకి వచ్చేసారు. వేణు శ్రీరామ్ డైరక్ట్ చేసిన ఈ సినిమా భాక్సాఫీస్ వద్దే కాక, ఓటీటిలోనూ పెద్ద హిట్టైంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా గురించిన రకరకాల విషయాలు బయిటకు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు హీరోగా మొదట పవన్ కళ్యాణ్ ని అనుకోలేదట. సోషల్ మీడియాలో ఈ విషయమై ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది. మంచి ఆపర్చునిటిని ఫలానా హీరో మిస్ చేసుకున్నాడంటున్నారు. ఇంతకీ ఎవరా హీరో అంటే...బాలయ్య అని చెప్పుకుంటున్నారు.

దిల్ రాజు మొదట రైట్స్ తీసుకున్నప్పుడు హిందీ ‘పింక్’ తెలుగు రీమేక్ ను మొదట బాలయ్య హీరోగా చేయాలనుకున్నారు మేకర్స్. ఈ మేరకు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు కూడా.. బాలయ్య ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో నిర్మాతలు పవన్ తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేశారు. ‘పింక్’ తమిళ్ రీమేక్ ‘నేర్కొండపార్వై’ లో స్టార్ హీరో అజిత్ నటించగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది.

అలాగే పవన్ ప్రస్తుతం చేస్తున్న  ‘అయ్యప్పనుమ్ కోషియమ్’.. మలయాళంలో అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించడానికి ప్రముఖ నిర్మాణసంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రైట్స్ సొంతం చేసుకుంది. చాలా రోజులుగా బిజు మీనన్ చేసిన ఎస్‌ఐ క్యారెక్టర్ బాలయ్య చేస్తాడని వార్తలొచ్చాయి. బాలయ్య ఎందుకో ఆసక్తి చూపలేదని, రానా నటిస్తానంటే ఆలోచిస్తానన్నాడనే మాటలూ వినిపించాయి. తర్వాత పృథ్వీరాజ్ రోల్ రానా చేస్తాడనీ అన్నారు. చివరకు పవన్ కళ్యాణ్, రానా చేస్తున్నారు. అలా బాలయ్య ఎటూ తేల్చక హోల్డ్‌లో పెట్టిన ‘వకీల్ సాబ్’, ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రెండు రీమేక్స్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లిపోయాయి అన్నమాట.