భారీ స్థాయిలో ఈ మూవీ తమిళ వెర్షన్ థియేటర్లలో సందడి చేయబోతోంది. ప్రస్తుతం తమిళంలో రిలీజ్ కి ఏ సినిమాలు లేకపోవడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసి వస్తుందంటున్నారు.
నందమూరి బాలకృష్ణ.. ద్విపాత్రాభినయంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ ఇతర కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్ద హిట్టైంది. రీసెంట్‌గా డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతూనే ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేయటానికి రంగం రెడి అయ్యింది.
జనవరి 28న శుక్రవారం `అఖండ` తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డబ్బింగ్ కార్యక్నమాలు పూర్తి చేసి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. భారీ స్థాయిలో ఈ మూవీ తమిళ వెర్షన్ థియేటర్లలో సందడి చేయబోతోంది. ప్రస్తుతం తమిళంలో రిలీజ్ కి ఏ సినిమాలు లేకపోవడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసి వస్తుందంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన తమిళనాడు థియేటర్ వర్గాలు `అఖండ` తమిళ వెర్షన్ కోసం భారీ స్థాయిలో థియేటర్లని కేటాయించారట. దీంతో అక్కడ బాలయ్య గర్జనకు అంతా రెడీ అయిపోయిందని అంటున్నారు. తెలుగులో సంచలనాలు సృష్టించిన `అఖండ` తమిళంలోనూ అదే రాంపేజ్ ని కంటిన్యూ చేయడం గ్యారెంటీ అంటున్నారు ఫ్యాన్స్.
మరో ప్రక్క డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ దిగ్గజం `అఖండ`ని అన్ని బాషల్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగిఏ పాన్ ఇండియా స్థాయిలో బాలయ్య `అఖండ` విశ్వరూపం చూపించడం ఖాయం అంటున్నారు. బోమపాటి శ్రీను - బాలకృష్ణల కలయికలో వచ్చిన మూడవ చిత్ర మిది. గతంలో సింహా లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ల తరువాత వచ్చిన `అఖండ` కూడా ఆ చిత్రాలకు మించి బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు బాలయ్య - బోయపాటి కాంబో హ్యాట్రిక్ కాంబోగా మారిపోయింది.
