నందమూరి బాలకృష్ణ పోలీస్ పాత్రలో కనిపిస్తే చాలు దాదాపు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టయినట్టే. పోలీస్ కాన్సెప్ట్ లో మాస్ ఎలిమెంట్స్ ని ఏ మాత్రం మిస్ కాకుండా చూసుకునే పూరి జగన్నాథ్ ఇప్పుడు తన స్టైల్ లో బాలయ్య కోసం ఒక పోలీస్ స్టోరీని సెట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరు పైసా వసూల్ సినిమా చేసిన విషయం తెలిసిందే. 

అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ పూరి జగన్నాథ్ తో మరో సినిమా చేయడానికి బాలకృష్ణ సిద్ధమయ్యారు. గతంలో చాలా సార్లు ఈ దర్శకుడు డిఫరెంట్ స్టైల్ లో హీరోలను పోలీస్ పాత్రల్లో చూపించారు. ఆ సినిమాలు హీరోల కెరీర్ లో బెస్ట్ ఫిలిమ్స్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు బాలయ్య బాబును కూడా ఒక యాంగ్రీ అండ్ మాస్ యాంగిల్ కాప్ గా ప్రజెంట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ సబ్జెక్ట్ తో పూరి బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరలో ఆ సినిమా మొదలుకానుంది. ఆ లోపు బాలకృష్ణ కెఎస్.రవికుమార్ - బోయపాటి సినిమాలను ఫినిష్ చేయనున్నాడు. అంటే బాలకృష్ణ పూరి కాంబో సెట్స్ పైకి రావడానికి చాలా సమయం పడుతుంది. త్వరలోనే ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వెలువడనుంది.