అఖండ  సినిమా అఖండ విజయంతో  దూసుకుపోతున్నాడు బాలయ్య. యంగ్ హీరోలను మించి, వరుస గా  మూవీస్ కు సైన్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం మలినేని గోపిచంద్ తో సినిమా కంప్లీట్ కావస్తోంది.  ఇక అసలు సమస్య మాత్రం ఇక్కడే స్టార్ట్ అయ్యింది.  నటసింహం సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ కోసం  చూస్తున్నారు మేకర్స్ 

అఖండ సినిమా అఖండ విజయంతో దూసుకుపోతున్నాడు బాలయ్య. యంగ్ హీరోలను మించి, వరుస గా మూవీస్ కు సైన్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం మలినేని గోపిచంద్ తో సినిమా కంప్లీట్ కావస్తోంది. ఇక అసలు సమస్య మాత్రం ఇక్కడే స్టార్ట్ అయ్యింది. నటసింహం సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ కోసం చూస్తున్నారు మేకర్స్ 

మంచి జోష్ మీద ఉన్నాడు బాలయ్య. అఖండ నింపిన జోష్ తో తరువాతి సినిమాలకు సంబంధించిన పనులు చకచకా నడిపిస్తున్నాడు. ఇప్పటికే మలినేని గోపీచంద్ తో పవర్ ఫుల్ మాస్ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇక నెక్ట్స్ సినిమాల విషయంలో కూడా హడావిడి స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ మూవీలో బాలయ్యకు ఆపోజిట్ విలన్ రోల్ కోసం కన్నడ స్టార్ దునియా విజయ్ ను రంగంలోకి దింపారు మేకర్స్ అయితే ఈమూవీ టైటిల్ విషయంలోనే ఇంకా తర్జన బర్జన పడుతున్నారు. 

బాలయ్య బాబు ఫ్యాన్స్ దిల్ కుష్ అయ్యేలా.. బాలకృష్ణ ఇమేజ్ కు తగ్గట్టు పవర్ ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకి ఫస్ట్ నుంచీ వేటపాలెం టైటిల్ అనుకుంటున్నారు. దీనితో పాటు చాలా టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమాకు అన్న‌గారు అనే టైటిల్ ను పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట టీమ్. మరికొంత మంది సమాచారం ప్రకారం దాదాపు ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో బాలయ్య క్యారెక్టర్ కు పొలిటిక‌ల్ ట‌చ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. సినీయ‌ర్ ఎన్టీఆర్‌ను అభిమానులు అన్న‌గారు అంటూ ప్రేమ‌గా పిలుచుకోవ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో బాల‌య్య బాబు పాత్ర‌ను ఉద్దేశించి ఈ టైటిల్ అయితే బావుంటుంద‌ని మేక‌ర్స్ ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలుస్తుంది. 

సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్స్ లో సమాచారం ప్రకారం చెప్పడమే కాని.. మూవీటీమ్ మాత్రం దీనిపై ఎటువంటి అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయలేదు. ఈ సినిమా కోసం మరికొన్ని టైటిల్స్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. జై బాల‌య్య లాంటి టైటిల్స్ ను ప‌రిశీల‌ించారు టీమ్. కాని ఇప్పటి వరకూ ఏ టైటిల్ ను ఫైనల్ చేయలేదు. అటు ఫ్యాన్స్ మాత్రం బాలయ్య సినిమా టైటిల్ చెప్పండంటూ మేకర్స్ పై ఒత్తిడి పెంచారు. అఖండ టైప్ లో సూపర్ సక్సెస్ పుల్ టైటిల్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. 

రాయలసీమ నేపథ్యంలో సాగే కథతో సినిమా తెరకెక్కుతోంది. ఈసారి కూడా భారీ యాక్షన్ సీన్స్ తో రచ్చ చేయబోతన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో... తండ్రీకొడుకులుగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమచారం. ఒక పాత్రలో ఫ్యాక్షన్ పొలిటికల్ లీడర్ గాను .. మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్ బాలకృష్ణ కనిపించనున్నారని చెబుతున్నారు. 

ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన శ్రుతిహాసన్ ఆడి పాడబోతోంది. . ఈ సినిమకు మరో అట్రాక్షన్ గా... నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ లేడీ విలన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించబోతున్నారు. ఈ మధ్యే గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాలో కూడా ఆమె పాత్రకి ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చింది. అందుకే ఈసారి కూడా ఆమెను తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమా తరువాత బాలయ్య అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.