తండ్రి ఎన్టీఆర్‌ బర్త్ యానివర్సరీ సందర్భంగా  తనయుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. మరోసారి ఆయన గాత్రంతో పాట పాడబోతున్నారు.

తండ్రి ఎన్టీఆర్‌ బర్త్ యానివర్సరీ సందర్భంగా తనయుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. మరోసారి ఆయన గాత్రంతో పాట పాడబోతున్నారు. ఈ విషయాన్ని బాలయ్య గురువారం వెల్లడించారు. రేపు శుక్రవారం(మే 28) ఎన్టీఆర్‌ జయంతి అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య ఫ్యాన్స్ ని ఖుషీ చేయాలని భావించారు. సొంతంగా ఆయన పాట పాడారు. 

పవిత్ర శ్లోకమైన `శ్రీరామదండంకం` ని ఆయన ఆలపించారు. పాట రూపంలో ఆ శ్లోకాన్ని రేపు విడుదల చేయబోతున్నారు. ఉదయం 9.45నిమిషాలకు దీన్ని విడుదల చేయనున్నట్టు బాలయ్య ప్రొడక్షన్‌ సంస్థ ఎన్‌బీకే ఫిల్మ్స్ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. గతేడాది తన బర్త్ డే సందర్భంగా బాలకృష్ణ `శివ శంకరీ..` అనే పాటని ఆలపించి ఫ్యాన్స్ ఫిదా చేశారు. మరి ఈ సారి తండ్రి జయంతి సందర్భంగా మరో పాట ఆయన నుంచి రావడం విశేషం. 

Scroll to load tweet…

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` చిత్రంలో నటిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయిక. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. `సింహా`, `లెజెండ్‌` చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇది కరోనా వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలయ్య గోపీచంద్‌ మలినేనితో మరో సినిమా చేయనున్నారు.