అమరావతి శాసన సభ సమావేశం అనంతరం హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ అన్న నందమూరి తారకరామారావు స్వస్థలమైన కృష్ణా జిల్లా నిమ్మకూరు వెళ్ళారు. బాలకృష్ణ బాల్యం లో ఎక్కువ నిమ్మకూరులో నే గడిపారు. విజయవాడ నుండి నిమ్మకూరు చేరుకున్న బాలకృష్ణ ముందుగా గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు నందమూరి తారకరామారావు ,బసవతారకం విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో ఉన్న బందువులను కలసుకుని వారిని ఆత్మీయంగా పలకరించారు. 

ఈనెల 29తేదిన  హైదరాబాద్ రామకృష్ణ స్టూడియో లో  ప్రారంభం కాబోయే ఎన్టీఆర్ బయో పిక్చర్స్  చిత్రం షూటింగ్ జరగనుండటంతో బందువులను ఆహ్వానించారు. నిమ్మకూరు లో ఎన్టీఆర్ ,సమకాలికులు ,బంధువులు  అభిమానుల ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు బాలకృష్ణ. హైదరాబాద్ లో జరిగే ప్రారంభోత్సవం కార్యక్రమం కి  రావలసిందిగా తమ బంధువులకు ఆహ్వాన పత్రికలు అంద చేసారు. భావితరాలు ఎన్టీఆర్  ఆశయాలను గుర్తుంచుకుని యన్ టి అర్ ను స్పూర్తి గా  తీసుకునే విధంగా సినిమా చిత్రీకరణ ఉంటుందని  బంధువులు కి తెలియజేశారు.

యన్ టి అర్ చిత్రం లో భాగంగా నిమ్మకూరు లో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ జరిగే అవకాశం ఉంది కాబట్టి .. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్వగ్రామం లో ఉన్న  సమకాలికులు తో ప్రత్యేకంగా సమావేశమైన బాలకృష్ణ వారి దగ్గర నుండి మరెన్నో వివరాలు తెలుసుకున్నారు. బాలయ్య తమ గ్రామానికి వస్తున్నాడని తెలుసుకుని బంధువులు, నందమూరి అభిమానులు భారీగా తరలివచ్చారు. బాలకృష్ణ పర్యటన సందర్భంగా పోలిసులు భారీ భద్రత ను ఎర్పాటు చేశారు.

ఈ సినిమా వచ్చే ఎన్నికలు దృష్టి లో ఉంచుకుని తీసే సినిమా కాదని సినిమా కి రాజకీయాలకి సంబంధం లేదని వచ్చే సంవత్సరం సినిమా పూర్తి చేసి విడుదల చేస్తామని అన్నారు. నందమూరి బాలకృష్ణ అల్లుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుండటం తో వాటి వివరాలు గ్రామంలో  ఇంతవరకు జరిన అభివృద్ధి పనులను అడిగితెలుసుకున్నారు. ఇంకా నిమ్మకూరు గ్రామనికి ఎటువంటి సౌకర్యం కావాలలో సమగ్రమైన సమాచారం తాయారు చేసి నివేదిక ఇమ్మని గ్రామస్తులు ను అడిగి తెలుసుకున్నారు.

 

నిమ్మకూరులో బెల్ కంపెనీ నైట్ విజన్ గాగుల్స్ తయారీ యూనిట్ పెట్టనుండటంతో వాటి పనులు ఎంత వరకు వచ్చాయిని అడిగితెలుసుకున్నారు. ముందుగా పామర్రు మండలం కొమరవోలు వెళ్ళి తన తల్లి బసవతారకం గారి తరుపున బంధువులను సినిమా ప్రారంభోత్సవం కి రావాలని ఆహ్వానం పత్రికలు అందజేశారు. తన తల్లి పేరు మీద హైదరాబాదు లో ఉన్న బసవ తారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ కి చైర్మన్ గా ఉండి అనేక మంది పేద ప్రజలకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్యాన్సర్ చికిత్స అందించటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ విధంగా తల్లిదండ్రులు ఋణం తీర్చుకునే అవకాశం రావటం నా పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నాని అన్నారు.

మా అమ్మగారు స్వగ్రామం కొమరవోలు ను మా అక్క నారా భువనేశ్వరి దత్తత తీసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయ్యటం ఆనందంగా ఉందన్నారు. బాలకృష్ణ చేతికి కట్టు కట్టుకుని స్వగ్రామంలో పర్యటించటంతో బంధువులు అభిమానులు ఏమైందని బాలకృష్ణ ను అడిగి తెలుసుకున్నారు. గత సినిమా షూటింగ్ లో చిన్నగా చెయ్యి నొప్పి రావటం జరిగిందని, అయితే అలాగే సినిమా పూర్తి చేశానని, ఇప్పుడు మూడునెలలు విరామం దొరకటంతో చికిత్స తీసుకున్నాని బంధువులకి తెలియజేశారు.