Asianet News TeluguAsianet News Telugu

'వీర సింహారెడ్డి'కి లాస్ట్ మినిట్ టెన్ష‌న్‌, 'వీరయ్య' కు ఆ సమస్య లేదు


మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" మరియు నందమూరి బాలకృష్ణ "వీరసింహారెడ్డి" సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Balakrishna Veera Simha Reddy release date tension
Author
First Published Jan 8, 2023, 6:14 AM IST

పెద్ద సినిమా షూట్ పూర్తి చేసి, రిలీజ్ ఫెరఫెక్ట్ చేయటం ఎంత ప్లానింగ్ ప్రకారం వెళ్లినా టెన్షన్ తో కూడుకున్నదే. ఎక్కడో చోట జరిగే లేటు మొత్తం పనులుపై పడి లేటు అవుతూంటాయి. ఓ ప్రక్కన రిలీజ్ టైమ్ దగ్గర పడి..లాస్ట్ మినిట్ టెన్షన్ మొదలవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకునే చాలా సార్లు డైరక్టర్స్ అలాంటివి లేకుండా జాగ్రత్తలు పడుతూంటారు.కాని ఇప్పుడు వీరసింహా రెడ్డికు, దిల్ రాజు వారసడుకు తప్పటం లేదని తెలుస్తోంది.  వివరాల్లోకి వెళితే..

 సంక్రాంతికి వీర‌సింహారెడ్డి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు నంద‌మూరి హీరో బాల‌కృష్ణ‌.   ఈనెల 12న విడుదల కాబోతోంది. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని వీర‌సింహారెడ్డి సినిమాను రూపొందిస్తోన్న ఈ చిత్రానికి బజ్ ఓ రేంజిలో ఉంది. ముఖ్యంగా అఖండ ఘ‌న విజ‌యం త‌ర్వాత బాల‌కృష్ణ న‌టించిన చిత్రం కావటం ప్లస్ అవుతోంది.  వీర‌సింహారెడ్డి రిలీజ్ కోసం చాలా రోజులుగా నంద‌మూరి అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు . రిలీజ్ డేట్ దగ్గర పడుతూండటంతో  సినిమా ట్రైలర్ విడుదల చేసింది టీమ్. ఈ ట్రైలర్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. మధ్య మధ్యలో వచ్చిన పొలిటికల్ సైటెర్స్ వైరల్ అవుతున్నాయి.  అయితే వీరసింహా రెడ్డి కు లాస్ట్ మినిట్ టెన్షన్ తప్పేటట్లు లేదని వార్తలు వస్తున్నాయి.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఫ‌స్ట్ కాపీ ఇంకా సిద్ధ‌వం కాలేదు. ఆ ప‌నుల్లోనే త‌మ‌న్ బిజీగా ఉండ‌డం వ‌ల్ల‌... ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా రాలేక‌పోయాడు. మరో ప్రక్క 11న ఓవర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు ఉన్నాయి. ఇంకా  ఫ‌స్ట్ కాపీ సైతం సిద్ధం కాలేదు. ఫ‌స్ట్ కాపీ రెడీ అవ్వాలి, ఆ త‌ర‌వాత సెన్సార్‌కు పంపాలి.... ఆ త‌ర‌వాతే.. ఓవ‌ర్సీస్‌కు ప్రింట్లు పంపాల్సి ఉంటుంది.  అందుకే వీర‌సింహారెడ్డి చిత్ర టీమ్ కి టెన్ష‌న్ మొద‌లైందని వినికిడి.

మరో ప్రక్క ఈ సంక్రాంతికి విడుదల కానున్న వార‌సుడు దీ ఇదే ప‌రిస్థితి అంటున్నారు. ఇప్ప‌టి వ‌రకూ ఫ‌స్ట్ కాపీ కూడా రెడీ కాలేద‌ట‌. 12న విడుదల కావాల్సిన సినిమాని ఒక్క రోజు ముందే అంటే 11న తీసుకొస్తా అని ప్ర‌క‌టించేశారు దిల్ రాజు.  అనుకొన్న స‌మ‌యానికి వీర సింహారెడ్డి, వార‌సుడు సినిమాలు రెడీ అవటం అనేది పెద్ద టాస్కే.  ఈ సినిమాల‌తో పోలిస్తే.. `వాల్తేరు వీర‌య్య‌` కు ఈ సమస్య రాలేదని తెలుస్తోంది. ఈ సినిమా ఫ‌స్ట్ కాపీ రెడీ అయిపోయింది. సెన్సార్ కూడా పూర్త‌య్యింది. కాబ‌ట్టి.. చిరు సినిమాకి ఈ లాస్ట్ మినిట్ టెన్ష‌న్ లు లేన‌ట్టే. 


ఇక వీరసింహా రెడ్డిలో  బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌న్న‌డ హీరో దునియా విజ‌య్ విల‌న్‌గా వీర‌సింహారెడ్డితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర పోషిస్తోంది. త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు.   బాలయ్యతో అదిరిపోయే మాస్ కంటెంట్ సినిమాలతో మూడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి బాలయ్యను హ్యాండిల్ చేసి హిట్ కొట్టాలంటే బోయపాటికి మాత్ర‌మే సాధ్యం అన్నట్టుగా పేరు తెచ్చుకున్నాడు. తన కెరిర్‌లో మొదటిసారిగా బాలయ్యతో సినిమా చేస్తున్న గోపీచంద్ మలినేని.. అసలు బాలయ్యను ఏ స్థాయిలో చూపించాడు.. ఏ రేంజ్ లో ఆయనతో యాక్షన్ చేయించాడు అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రాక్ ని మించి హిట్ అవుతుందని నమ్ముతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios