‘వీరసింహారెడ్డి’ వీర మాస్ బ్లాక్ బస్టర్ 100 డేస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఈవెంట్ కు చిత్ర టీమ్ అంతా హాజరుకాబోతుంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’.శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. సంక్రాంతి కానుకగా జనవరి నెల 12న విడుదలైన వీరసింహారెడ్డి తొలి రోజునే రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించి, ఆ తర్వాత వరస రికార్డ్ లతో దూసుకుపోయింది. తాజాగా ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం వంద రోజులు పంక్షన్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ని విడుదల చేసారు.
ఎనిమిది కేంద్రాలలో విజయవంతంగా వంద రోజులని పూర్తి చేసుకుంటోంది. ఏప్రిల్ 23న ‘వీరసింహారెడ్డి’ వీర మాస్ బ్లాక్ బస్టర్ 100 డేస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఈవెంట్ కు చిత్ర టీమ్ అంతా హాజరుకాబోతుంది. ‘వీరసింహారెడ్డి’ సినిమా హిందూపురం, చిలకలూరి పేట, ఆలూరు లో డైరెక్ట్ గానూ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, ఆదోని, ఆళ్ళగడ్డలో సింగిల్ షిఫ్ట్ తోనూ శతదినోత్సవం పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా హిందూపురంలో ఈ నెల 23న వంద రోజుల వేడుక జరుగనుందని సమాచారం. అయితే వెన్యూ ఎక్కడనేది ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు.
ప్రతి వారం అనేక రిలీజులు స్క్రీన్‌ల కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో, థియేట్రికల్ బిజినెస్ 2-3 వారాల వ్యవహారంగా మారింది. ఈ తరుణంలో సినిమా 100 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా థియేటర్‌లో నడవడం అరుదైన, పెద్ద విజయం సాధించింది. అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలతో కూడిన మంచి కంటెంట్ చిత్రాలను పోటీతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తున్నారనే వాస్తవాన్ని నిరూపించింది. ఇది బాలకృష్ణకు హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
వీరసింహారెడ్డి పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కాదు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రీత్ టేకింగ్ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఆకట్టుకునే డ్రామా సమపాళ్లలో ఉన్నాయి. బాలకృష్ణ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, హనీ రోజ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఎస్ థమన్ ఒక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించాడు. వీరసింహారెడ్డి బాలకృష్ణ, తమన్ కాంబినేషన్‌లో రెండవ బ్లాక్‌బస్టర్.
‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత బాలకృష్ణ, ‘క్రాక్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత గోపిచంద్ మలినేని.. ఇద్దరు కలిసి రావడంతో ప్రేక్షకులు థియేటర్‌లకు పోటెత్తారు. దానితో పాటుగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. కానీ టాక్‌తో సంబంధంలేకుండా ఓపెనింగ్స్ భారీ స్థాయిలో రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్ల పరంగా కుమ్మేయటం కలిసొచ్చింది. అటు ఓవర్సీస్‌లో (Oversease) కూడా ఈ రెండు సినిమాలకు మంచి వసూళ్లు వచ్చాయి. ప్రధానంగా యూఎస్ బాక్సాఫీస్ (US Boxoffice) వద్ద వీరయ్య, వీరసింహా కనకవర్షం కురిపించాయి.
