మిమ్మల్ని డైరెక్ట్ చేయలేను.. మీకు కోపం ఎక్కువ.. ఏది పడితే అది తిడతారు. నావర్కింగ్ స్టైల్ వేరు.. అంటూ అన్ స్టాపబు షోలో బాలయ్య గురించి.. అదరిపోయే కాంట్రవర్సిషల్ డైలాగ్స్ వినిపించాయి డైరెక్టర్ రాజమౌళి నుంచి. ఇంతకీ ఆయన ఏమన్నారు..?
అన్ స్టాపబుల్(Unstoppable) షోతో బాలయ్య(Balakrishna) హడావిడి మామూలుగా లేదు. స్టార్ సెలబ్రిటీలతో ఓ ఆట ఆడుకుంటూ.. ఓ రేంజ్ లో షోను హ్యాండిల్ చేస్తున్నాడు బాలయ్య. తన మార్క్ హాస్యంలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ... షో చివర్లో సెంటిమెంట్ తో కన్నీరు పెట్టిస్తున్నారు బాలయ్య. ఈ సారి అన్ స్టాపబుల్ అంటూ..షోలోకి యూనివర్సల్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli), మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సందడి చేశారు.తమదైన శైలిలో డైలాగ్స్ వదులుతూ.. షోను అదరగొట్టారు.
అన్ స్టాపబుల్ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ముఖ్యంగా బాలయ్య-రాజమౌళి కాంబినేషన్ పై చర్చ గట్టిగానే జరిగింది. మన కాంబినేషన్ ఎప్పుడూ... అంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు రాజమౌళి(Rajamouli)గారు అంటూ బాలయ్య అన్నారు..దాంతో పాటు నన్ను డైరెక్ట్ చేయలేను అన్నారట.. నిజమేనా అని కూడా Balakrishna జక్కన్నను ప్రశ్నించారు. దానికి రాజమౌళి సమాధానం చెపుతూ.. మిమ్మల్ని డైరెక్ట్ చేయాలంటే.. టెన్షన్.. భయం సార్ అంటూ సమాధానం చెప్పారు.
అంతే కాదు ప్రోమోలో చూసిన దాని ప్రకారం.. జక్కన్న మాట్లాడుతూ.. మీకు కోపం ఎక్కువ.. కోపం వస్తే ఎదుటివాడు ఎవరు అని కూడా చూడరు..నోటికొచ్చినట్టు తిట్టేస్తారు... మిమ్మల్ని హ్యాండిల్ చేయడం కష్టం అంటూ.. చెప్పినట్టు చూపించారు. సెట్స్ మీద నా పద్ధతి విభిన్నంగా ఉంటుంది. హీరో పరిస్థితిని పట్టించుకోను. వానకు తడుస్తున్నాడా.. ఎండలో ఉన్నాడా? అనేది చూడను, నా షాట్ గురించే ఆలోచిస్తుంటాను. ఇలా ఉండే నేను మిమ్మల్ని ఎలా డైరెక్ట్ చేయగలను సార్.. అంటూ రాజమౌళి చెప్పినట్టు తెలుస్తోంది. దానికి సరైన పద్దతిలోనే తన మార్క్ లో బాలయ్య కూడా సమాధానం ఇచ్చారు.
Pushpa Romantic Scene: పుష్ప మూవీ నుంచి ఆ... సీన్ కట్... అంత ఘోరంగా ఉందా..?
అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటీ అంటే.. ప్రోమో కోసం అక్కడక్కడ కట్ చేయడం వల్ల కాంట్రవర్సియల్ పాయింట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. బట్ షోకి వచ్చేప్పటికీ.. బాలకృష్ణ కూడా తన గురించి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కసారి కారవాన్ లోంచి దిగి మళ్లీ కారవాన్ లోకి ఎక్కేంత వరకు దర్శకుడు ఎలా చెబితే అలా నడుచుకుంటానని..చెప్పారు బాలయ్య.. షూటింగ్ పూర్తయ్యాకే తిరిగి కారవాన్ లో అడుగుపెడతానని, స్పాట్ లో గొడుగు కూడా పట్టనివ్వనని నటసింహం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. బాలయ్య- రాజమౌళి షో అనేసరికి.. వ్యూవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
